దుబాయ్‌లో ఉద్యోగమన్నాడు... లాడ్జిలో బంధించి అత్యాచారం చేశాడు... !

దుబాయ్‌లో ఉద్యోగం అన్నాడు.... శరీరక అవసరాలు తీర్చుకుంటున్నాడు... అయినా....దుబాయ్ పంపించేందుకు మాత్రం నిరాకరించాడు..దీంతో అసలు విషయాన్ని గమనించిన మహిళ చివరకు చేసేదిమిలేక సదరు మోసగాడ్నీ రచ్చకీడ్చింది. విషయం బయటపడడంతో మోసగాడు పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.

Recommended Video

    రేప్ కు ఉరే సరి అంటున్నదుబ్బాక వాసులు..
    దుబాయ్‌లో ఉద్యోగమంటూ అత్యాచారం

    దుబాయ్‌లో ఉద్యోగమంటూ అత్యాచారం

    ఉద్యోగాల పేరుతో మోసగాళ్లభారిన పడుతున్న వారు కోకొల్లలు...అయినా ఉద్యోగం మీద ఆశ, బతుకు బండి ఈడ్చాలనే తపన నయా మోసగాళ్లకు వరంగా మారుతోంది. దీంతో నిరుద్యోగ యువతి యువకులతో పాటు ఉద్యోగాలు చేయాలనుకునే వారికి శరఘతంగా మారుతున్నాయి. ఈనేపథ్యంలోనే ఉద్యోగుల మోసాలు... భాదితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.. ఈనేపథ్యంలోనే పురుషులను డబ్బుల రూపంలో మోసం చేస్తున్నవారు మహిళలను మాత్రం డబ్బులతో పాటు శరీరక అవసరాలకు కూడ ఉపయోగించుకుంటున్నారు..గుట్టుచప్పుడు కాకుండా పని కానిచ్చి విషయం బయటపడడంతో పరారవుతున్నారు..

    వీసా పేరుతో చెన్నైకి

    వీసా పేరుతో చెన్నైకి

    తాజాగా ఇలాంటీ సంఘటన హైదరాబాద్‌లో జరిగింది..తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నర్సింహమూర్తి హైదరాబాద్‌లోని గోపాలపురం ప్రాంతంలో ఉంటూ ట్రావెల్ ఎజెంట్‌గా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా ట్రావెల్ ఎజెంట్‌గా కొనసాగతూనే ఉద్యోగాల కోసం పలువురిని దుబాయ్ పంపాడు. దీంతో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోంటున్న ఓ మహిళ ఇటివల మరో యువతి దుబాయ్‌లో ఉద్యోగాల కోసం నర్సింహమూర్తిని సంప్రదించారు. ఇందుకు అంగీకరించిన ఆయన వీసా ప్రాసెస్ కోసం వారిని తీసుకుని ఈనెల 18న చెన్నై వెళ్లాడు. అయితే చెన్నైకి వెళ్లిన ఇద్దరు మహిళల్లో ఒకరికి వీసా రావడంతో ఆమే వెళ్లిపోయింది.

     మూడు రోజుల పాటు లాడ్జిలో బంధించిన ట్రావేల్ ఎజెంట్..

    మూడు రోజుల పాటు లాడ్జిలో బంధించిన ట్రావేల్ ఎజెంట్..

    అయితే మరో యువతికి వీసా రాకపోవడంతో లాడ్జీలోనే ఉన్నారు. దీంతో ఒంటరిగా ఉన్న మహిళను లొంగదీసుకుని అత్యచారం చేశాడు..అయినా యువతి ఉద్యోగం మీద ఆశతో ఎలాంటీ ఇబ్బందులు పెట్టకుండా ఊరుకుంది. దుబాయ్‌కి వెళ్లాలనే ఆకాంక్షలో తన అవమానాలకు,అత్యచారానికి గురైంది. ఇక యువతి బలహీనతను ఆసరా చేసుకున్న ట్రావేల్ ఏజెంట్ పాస్‌పోర్ట్ పేరుతో సికింద్రాబాద్‌కు తీసుకువచ్చాడు. మహిళను లాడ్జ్‌లో ఉంచాడు. అనంతరం సికింద్రబాద్‌ లాడ్జ్‌లో కూడ మహిళపై అత్యచారం చేసి కామవాంచ తీర్చుకున్నాడు. దీంతో మెలుకున్న యువతి ఏజెంట్‌కు తనను దుబాయ్‌కు పంపే ఆలోచన లేదని పసిగట్టింది.

    తప్పించుకున్న యువతి పోలీసులకు పిర్యాధు

    తప్పించుకున్న యువతి పోలీసులకు పిర్యాధు

    దీంతో ఎజెంట్ బారి నుండి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేసింది. లాడ్జీలోని బాత్‌రూంలోకి దూరి పెద్దగా ఆరవడం ప్రారంభించింది. యువతి అరుపులతో భయపడిన నర్సింహముూర్తి ఆమే పాస్‌పోర్టు తీసుకుని పరారయ్యాడు. దీంతో యువతి కేకలు విన్న లాడ్జ్ సిబ్బంది కాపాడి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. దీంతో యువతి ట్రావెల్ ఏజెంట్ నర్సింహమూర్తిపై పిర్యాధు చేసింది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. అనంతరం అత్యచారానికి పాల్పడ్డ ఏజెంట్‌ను అరెస్ట్ చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+