సీఎం కేసీఆర్‌ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రోజా

తెలంగాణ సీఎం కేసీఆర్ 66వ జన్మదిన వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిపారు కార్యకర్తలు, అభిమానులు. ఉదయం నుంచి కేసీఆర్‌ను పలువురు ప్రముఖలు కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మరికొందరు కేసీఆర్ జన్మదినంను పురస్కరించుకుని కొందరు మొక్కలు నాటారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం జగన్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఏపీ మాజీ మంత్రి లోకేష్‌లు ట్విటర్ ద్వారా సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ఏపీ వైసీపీ ఎమ్మెల్యే ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ను తన నివాసంలో కలిసిన రోజా పుష్పగుచ్చాన్ని అందజేశారు. రోజా తన సోదరిలాంటిదని కేసీఆర్ ఎప్పుడూ చెప్పేవారు. ఎమ్మెల్యే రోజాపై సీఎం కేసీఆర్ ప్రత్యేక అభిమానం చూపుతారు. గతేడాది తమిళనాడులోని అత్తి వరదరాజస్వామిని దర్శించుకొని తిరిగి వెళుతూ మార్గమధ్యంలోని నగరిలో సీఎం కేసీఆర్ ఆగారు. ఆ సందర్భంగా రోజా ఆహ్వానం మేరకు కేసీఆర్ తన భార్య శోభ, కుమార్తె కవితతో కలిసి రోజా నివాసంకు వెళ్లారు. రోజా ఇంట్లోనే భోజనం చేశారు సీఎం కేసీఆర్.

YCP MLA Roja meets CM KCR on his birthday, conveys wishes

సీఎం కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని పలు సేవాకార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు కార్యకర్తలు అభిమానులు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని జమ్మికుంట రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. ఆ తర్వాత జమ్మికుంట రైస్ మిల్లర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ జన్మదిన సంబరాలు ఏపీలోని కనిపించాయి. కాకినాడలో కేసీఆర్ అభిమానులు మొక్కలు నాటి, విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+