Hyderabad Metro: టికెట్ కొనకుండానే మెట్రో ఎక్కొచ్చు.. !

హైదరాబాద్ లో మెట్రో రైలు ఎక్కాలంటే.. ముందుగా టికెట్ కొనుగోలు చేయాలి. ఆ తర్వాత మెట్రో ట్రైన్ ఎక్కాలి. దీన్ని క్లోజ్డ్‌ లూప్‌ టికెటింగ్‌ విధానమని అటారు.అయితే ఈ విధానానికి హైదరాబాద్ మెట్రో స్వస్తి పలికే అవకాశం ఉంది. దీని వల్ల కొంత మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఎలాగంటే.. ఒక వ్యక్తి ఉప్పల్ మెట్రో స్టేషన్ మెట్రో ఎక్కాడు. అతను పరేట్ గ్రౌండ్ స్టేషన్ వరకు టికెట్ తీసుకున్నాడు. అయితే అతని ఫ్రెండ్ ఫోన్ చేసి బేగంపేటకు రావాలని కోరాడు.

దీంతో అతను పరేడ్ గ్రౌండ్ వద్ద దిగి మరోసారి టికెట్ కొనుగోలు చేసి బేగంపేటకు వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే బేగంపేట వరకు ప్రయాణించి.. అదనంగా ప్రయాణించిన దూరానికి దిగే స్టేషన్ లో డబ్బులు చెల్లించాలి. అలాగే ఉప్పల్ నుంచి పరేడ్ గ్రౌండ్ టికెట్ తీసుకుని తార్నాకలో దిగాలంటే కూడా కూడా సాధ్యం కాదు. క్లోజ్డ్‌ లూప్‌ టికెటింగ్‌ విధానంలో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఓపెన్ లూప్ టికెటింగ్ విధానంలో ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ విధానంలో దూరాన్ని బట్టి డబ్బులు చెల్లించాలి.

You can board the Hyderabad Metro train without buying a ticket

ఓపెన్ లూప్ విధానంలో మనం మెట్ర స్టేషన్ లో టికెట్ లేకుండానే మెట్రో ఒగ్గొచ్చు. దిగేటప్పుడు మాత్రం టికెట్ కొనుగోలు చేస్తే సరిపోతోంది. ఈ ఓపెన్ లూప్ టికెటింగ్ విధానంలో పలు దేశాల్లో అమలు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ మెట్రో కూడా ఓపెన్ లూప్ టికెటింగ్ విధానం టికెటింగ్ విధానం తీసుకురావాలని ఎల్అండ్ టీ భావిస్తోంది. నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డు(ఎన్‌సీఎంసీ) ద్వారా దీన్ని అమలు చేయాలనేది ప్రణాళిక రచిస్తోంది. ఇప్పటికే మెట్రోరైలు స్టేషన్లలో ఎన్‌సీఎంసీకి సంబంధించిన టికెట్‌ వ్యవస్థలను అన్ని స్టేషన్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇది ప్రయాణికులకు అందుబాటులోకి వస్తే బస్సు, మెట్రో, ఎంఎంటీఎస్‌ అన్నింటికీ ఒకటే కార్డుతో చెల్లించవచ్చని చెబుతున్నారు. మన దేశంలో 2022లో హరియాణా బస్సుల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. బస్సు ఎక్కేటప్పుడు కార్డును యంత్రం వద్ద చూపించాలి.. మళ్లీ దిగేటప్పుడు చూపిస్తే జీపీఎస్‌ ఆధారంగా ప్రయాణించిన దూరాన్ని బట్టి ఛార్జీ తీసుకుంటుంది. ఇదే విధానం త్వరలో హైదరాబాద్‌లో మన మెట్రోలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+