ఫ్రెండ్‌నే చంపారు.. హైదరాబాద్‌లో దారుణం
హైదరాబాద్ : బంధాలు తప్పటడుగులు వేస్తున్నాయి. అనుబంధాలు కనుమరుగవుతున్నాయి. ఇక దోస్త్ మేరా దోస్త్ అంటూ పాటలు పాడుకున్న స్నేహితులు కూడా అదే కోవలోకి వస్తే ఎలా ఉంటుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే స్నేహితులు కుట్రలు పన్నితే ఇంకేమైనా ఉంటుందా. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో చోటు చేసుకున్న ఓ ఘటన మిత్రద్రోహానికి పరాకాష్టలా మిగిలింది. నమ్మిన దోస్తులే చివరకు కాలాంతకులయ్యారు.
ఉప్పల్ పరిధిలోని రామాంతపూర్‌లో దారుణం జరిగింది. నమ్మిన పాపానికి తోటి స్నేహితుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు యువకుడు. కేసీఆర్ నగర్‌కు చెందిన 26 ఏళ్ల యువకుడు ప్రసాద్.. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో శవమై కనిపించాడు. అతడి స్నేహితులే కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రాణానికి ప్రాణంగా చూసుకోవాల్సిన స్నేహితుల చేతిలో ప్రసాద్ చావడం స్థానికంగా విషాదం నింపింది.

ప్రసాద్‌ను చంపిన అనంతరం నిందితులు పరారీలో ఉన్నారు. విషయం తెలిసిన స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించే పనిలో పడ్డారు. స్నేహితుల మధ్య రగిలిన అంతర్గత కక్షలే ప్రసాద్ హత్యకు దారి తీసి ఉండొచ్చిన అనుమానిస్తున్నారు. ప్రసాద్‌ను హత్య చేసే సమయంలో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఉండొచ్చని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
నమ్మిన స్నేహితులే ప్రసాద్‌ను పొట్టనపెట్టుకోవడం అతడి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. పొద్దస్తమానం స్నేహితులంటూ వాళ్ల వెంబడి తిరిగే ప్రసాద్ చివరకు వారి చేతిలోనే హతమై కానరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications