కేటీఆర్.. మీరు మంచి నటుడు కూడా! ఔనా.. గుర్తుపెట్టుకుంటా: సుధీర్ బాబు, కేటీఆర్ సరదా వ్యాఖ్యలు
హైదరాబాద్: టాలీవుడ్ యువ నటుడు సుధీర్ బాబు మంత్రి కేటీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ రాజకీయ నాయకుడే కాదు, మంచి నటుడు కూడా అని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం హైదరాబాద్ హైటెక్స్‌లో జరుగుతున్న ఇండియా జాయ్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్, సుధీర్ బాబు హాజరయ్యారు.

సుధీర్ బాబు, కేటీఆర్ మధ్య ఆసక్తికర సంభాషణ
ఈ కార్యక్రమంలో సుధీర్ బాబు మాట్లాడుతూ కేటీఆర్ ను ప్రశంసిసిస్తూనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సరదా వ్యాఖ్యలకు వివరణ కూడా ఇచ్చారు. సుధీర్ బాబు మాటలు విన్న కేటీఆర్.. నవ్వుతూ ఆ మాటలను తన మనస్సులో పెట్టుకుంటానని అన్నారు. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు సుధీర్ బాబు. ఇరువురు మధ్య జరిగిన సంభాషణలు.. ఇండియా జాయ్‌లో కొద్దిసేపు నవ్వులు పూయించాయి.

కేటీఆర్ రాజకీయ నాయకుడే కాదు.. మంచి నాయకుడు కూడా
మంత్రి కేటీర్ మంచి రాజకీయ నాయకుడే కాదు. మంచి నటుడు కూడా అని వ్యాఖ్యానించారు సుధీర్ బాబు. కేటీఆర్‌కు తాను పెద్ద అభిమానినని సుధీర్ బాబు చెప్పుకొచ్చారు. ఒక మంచి రాజకీయ నాయకుడిలో ఒక మంచి నటుడు కూడా ఉంటాడు. ఒక నటుడు అన్నీ మరిచిపోయి పాత్రకు తగినట్లుగా నటించాలి. అలాగే రాజకీయ నాయకుడు కూడా ప్రజలకు మంచి చేయాలంటే తన గురించి తన కుటుంబం గురించి మరిచపోయి పనిచేయాలి అలాంటి వ్యక్తి కేటీఆర్ అని సుధీర్ బాబు వ్యాఖ్యానించారు.

కేటీఆర్‌నే అనుసారిస్తానంటూ సుధీర్ బాబు
ఒక వేళ భవిష్యత్తులో తాను రాజకీయ నాయకుడిగా నటించే అవకాశం వస్తే కేటీఆర్‌ను అనుసరిస్తానని సుధీర్ బాబు చెప్పుకొచ్చారు. ఆయనలాగే ఉండేందుకు ప్రయత్నిస్తానన్నారు. కేటీఆర్ సినిమాల్లోకి రానందుకు ఆనందంగా ఉందని సుధీర్ బాబు. సుధీర్ బాబు మాటలు విన్న మంత్రి కేటీఆర్.. సరదాగా స్పందించారు.
Recommended Video

గుర్తుపెట్టుకుంటానంటూ సుధీర్ బాబుకు కేటీఆర్.. నవ్వులు
సుధీర్ తనను అనుకోకుండా నటుడ్ని చేశాడన్నారు మంత్రి కేటీఆర్. తనను పొలిటీషియన్ కంటే నటుడిగానే బాగుంటావన్నాడు. ఏంటీ సుధీర్? అంటూ ప్రశ్నించారు. తాను రాజకీయ నాయకుడిగా కాకుండా నటుడిగా కనిపిస్తున్నానా? ఓకే సుధీర్? ఇది నేను మనసులో పెట్టుకుంటా? ఏది ఏమైనా ఈ విషయాన్ని తాను చాలా పాజిటివ్ వేలో చూస్తున్నా.. థ్యాంక్యూ సుధీర్. నీ ప్రశంసలు స్వీకరిస్తున్నా అని కేటీఆర్ వ్యాఖ్యానించడంతో అక్కడున్నవాళ్లంతా కాసేపు సరదాగా నవ్వుకున్నారు.












Click it and Unblock the Notifications