పాలనలో భాగస్వాములు కండి.. నిరుద్యోగులకు కవిత పిలుపు, హోళి విషెస్

తెలంగాణ రాష్ట్రంలో భారీగా కొలువులు భర్తీ కానున్నాయి. దీంతో ఇప్పటికే యువతకు కేటీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 6 నెలలు సినిమాలు చూడొద్దు.. మంచిగా చదవాలని కోరారు. ఇప్పుడు కవిత వంతు వచ్చింది. ఆమె కూడా యువతకు సజెస్ట్ చేయడంతోపాటు.. హోళి శుభాకాంక్షలను కూడా తెలియజేశారు. మంచిగా ప్రిపేర్ కండి.. ప్రభుత్వ కొలువు పట్టాలని కోరారు.

నిరుద్యోగుల‌కు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత స‌ల‌హా ఇచ్చారు. ఉద్యోగ నియామక‌ ప‌రీక్ష‌లపై శ్ర‌ద్ధ పెట్ట‌డంతో ఉద్యోగాల‌ను సాధించి ప్ర‌భుత్వ పారిపాల‌న‌లో భాగ‌స్వాములు కావాల‌ని పిలుపునిచ్చారు. శ్రద్ధ పెట్టి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి పరిపాలనలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఆమె ఇచ్చిన పిలుపు నిరుద్యోగుల్లో స‌రికొత్త ఉత్సాహం నింప‌నుంది.

youth must partner government rule:mlc kavitha

దీంతోపాటు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు హోలీ శు‌భాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో విడుద‌ల చేశారు. అందులోనే నిరుద్యోగుల‌కు సజెస్ట్ చేశారు. హోలీ సంతోషంగా నిర్వ‌హించుకోవాల‌ని.. అయితే ఆర్గానిక్ రంగుల‌నే వినియోగించాల‌ని రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను కోరారు. మిగతా కలర్ వాడటం వల్ల ఇబ్బందులు తప్పవని సూచించారు.
ఇటు రంగులతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కాపర్ సల్ఫైట్, మెర్క్యూరీ సల్ఫైట్‌తో పాటు ఇతర రసాయనాలతో కలిపిన రంగులను వాడుతున్నారు. వీటిని వాడటం వల్ల అనారోగ్యానికి గురవుతారు. కళ్లలో పడితే కంటి చూపు పోయే అవకాశం ఉందని, సహజ రంగులతో పండుగను నిర్వహించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సో అందరూ.. ఉత్సహంగా హోలి పండగ నిర్వహించుకొండి.. కానీ తగిన జాగ్రత్తలను మాత్రం తీసుకొండి.

Recommended Video

    Telangana: తెలంగాణలో Aam Aadmi Party పాదయాత్ర Kejriwal టార్గెట్ KCR | Oneindia Telugu

    హిరణ్య కశ్యపుని సోదరి హోలిక ప్రహ్లాదుని చంపబోయి తాను దహనం అవుతుంది. ఆ రాక్షసి చనిపోయిన రోజును పురస్కరించుకుని హోలీ పండుగను నిర్వహిస్తారు. మరో కథ కూడా ప్రచారంలో ఉంది. ఫాల్గుణ పౌర్ణమి రోజున కాముని పున్నమి పేరుతో సంబరాలు జరుపుకుంటారు. సతీవియోగంతో విరాగిలో మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు. దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మథుని సాయం తీసుకున్నారు. మన్మథుడు శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి, తపోభంగం కలిగించాడు. తపో భంగంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మథున్ని భస్మం చేస్తాడు. అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మథుడి బొమ్మను గడ్డితో చేసి తగులబెడతారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+