Sharmila: షర్మిల నిరాహార దీక్షకు హైకోర్టు అనుమతి..
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల(Sharmila) నిరాహార దీక్ష చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. షర్మిల అఖిలపక్షాలతో కలిసి టీ సేవ్ పేరుతో దీక్ష చేయనున్నారు. దీక్ష చేసుకునేందుకు పోలీసులను అనుమతి కోరారు. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు దీక్షకు అనుమతి ఇవ్వలేదు. దీనిపై షర్మిల హైకోర్టును ఆశ్రయించారు. షర్మిల పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు దీక్ష చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే దీక్షకు 48 గంటల ముందు పోలీసులకు తెలపాలని చెప్పింది. అలాగే నిరాహార దీక్షకు 500 మంది కంటే ఎక్కువ హాజరు కావొద్దని స్పష్టం చేసింది.
ఇంతుకు ముందే షర్మిల నిరుద్యోగుల సమస్యలపై పోరాడేందుకు బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, టీడీపీ, తెలంగాణ జనసమితి, జనసేన, బీఎస్పీ, సీపీఐ,సీపీఎం, ఎమ్మాఆర్ పీఎస్ లతో పాటు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు లేఖ రాశారు. తమతో కలిసి రావాలని కోరారు. నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే ప్రతిపక్షాలంతా ఐక్యంగా పోరాడాలన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం కలిసి పోరాడిన పార్టీలు నిరుద్యోగుల కోసం ఏకం కావాలని కోరారు. 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉంటే కేవలం 80 వేలు మాత్రమే ఖాలీగా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినా.. పేపర్ల లీక్ తో పరీక్షలు వాయిదా పడ్డాయన్నారు.

నిరుద్యోగుల సమస్యలపై బీజేపీ, కాంగ్రెస్ కూడా పోరాటం చేస్తోంది. కొద్ది రోజుల క్రితం బీజేపీ హన్మకొండల నిరుద్యోగ మార్చ్ నిర్వహించింది. టీఎస్‌పీఎస్సీ తప్పు లేకుంటే సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మార్చ్ ఇంతటితో ఆగదని, త్వరలో ఖమ్మం , పాలమూరు సహా 10 ఉమ్మడి జిల్లాలో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని, తరువాత హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామన్నారు బండి సంజయ్.
ఇటు ఈ నెల 24న ఖమ్మం, 26న ఆదిలాబాద్, 28న నల్గొండ, మే 1వ తేదీన రంగారెడ్డి జిల్లాల్లో నిరసన ర్యాలీలు, సభలను నిర్వహించనుంది. ఆ సభల్లో ఆయా జిల్లాలకు చెందిన నేతలతోపాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పార్టీ వివిధ విభాగాల చైర్మన్లు, డీసీసీ ప్రెసిడెంట్లు పాల్గొంటారని పార్టీ పేర్కొంది.
జిల్లాల్లో నిరసన దీక్షలకు ఏర్పాట్లు, నేతలకు సమాచారం ఇచ్చే బాధ్యతలను డీసీసీ ప్రెసిడెంట్లే చూసుకోవాలని సూచించింది.












Click it and Unblock the Notifications