Zero Shadow day: హైదరాబాద్‌లో- డేట్ అండ్ టైమ్ ఇదే..!!

హైదరాబాద్: జీరో షాడో డే. మన నీడ మనకు కనిపించకుండా పోయే అత్యంత అరుదైన సందర్భం. కొన్ని నిమిషాల పాటు మాత్రమే ఉండే ఈ వింత సంఘటన కొద్దిరోజుల కిందటే బెంగళూరియన్లను అబ్బురపరిచింది. ఖగోళపరంగా ఇదో అద్భుతం. కిందటి నెల 25వ తేదీన బెంగళూరులో జీరో షాడో డే ఏర్పడింది. ఒకటిన్నర నిమిషాల పాటు నీడ అదృశ్యమైంది.

ఈ సందర్భంగా బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. 25వ తేదీన ఈ మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 17 నిమిషాలకు ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. సూర్యుడు నడినెత్తిన వచ్చినప్పుడు మన నీడ.. భూమిపై అసలు పడలేదు. ఆ సమయంలో సూర్య కిరణాలు నిట్ట నిలువుగా భూమిపై ప్రసరించడమే దీనికి కారణం. ఏ వస్తువు నీడ కూడా భూమిపై పడదు. సంవత్సరానికి రెండుసార్లు ఈ జీరో షాడో రోజు ఏర్పడుతుంది.

Zero Shadow day

2021లో ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జీరో షాడో డే సంభవించింది. కిందటి నెల బెంగళూరులో ఇది కనిపించింది. ఇప్పుడు అలాంటి సందర్భం.. ఇక హైదరాబాదీయులను పలకరించబోతోంది. ఈ నెల 9వ తేదీన హైదరాబాద్‌లో జీరో షాడో ఏర్పడబోతోంది. 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలకు భూమిపై నిట్టనిలువుగా ప్రసరించడం ద్వారా ఈ ఖగోళ వింత ఆవిష్కృతం కానుంది. 90 డిగ్రీల కోణంలో ఉంచిన ఏ వస్తువు నీడ కూడా ఆ సమయంలో భూమిపై పడదు.

సుమారు రెండు నిమిషాల పాటు అంటే 12:12 నుంచి 12:14 నిమిషాల వరకు ఇది కొనసాగుతుందని హైదరాబాద్ బీఎం బిర్లా సైన్స్ ప్లానెటోరియం అధికారి హరిబాబు తెలిపారు. ఇలాంటి సంఘటనలు సంవత్సరంలో రెండు సార్లు ఏర్పడుతుంటాయి. ఉత్తరాయణ-దక్షిణాయన సమయంలో సూర్యకిరణాలు నిలువుగా ప్రసరిస్తాయి. భూ భ్రమణ అక్షం.. సూర్యుడు, దాని కక్ష్యకు 23.5 డిగ్రీలు వంగి ఉండటం వల్ల ఇది సాధ్యపడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+