వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1.8 కిలోల బంగారం, 2.82 కోట్ల నగదు స్వాధీనం.. సత్యేంద్ర జైన్, అతని సహాయకుల ఇళ్లలో..

|
Google Oneindia TeluguNews

మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్.. అతని సహాయకుల ఇళ్లలో ఈడీ సోదాలు చేసింది. భారీగా బంగారం, నగదు పట్టుబడింది. సత్యేంద్ర జైన్, అతని భార్య పూనమ్ జైన్, సహాయకులపై గత నెల 30వ తేదీన ఈడీ కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈడీ రూ.2.82 కోట్ల నగదు, 1.8 కిలోల బంగారు కాయిన్స్ స్వాధీనం చేసుకున్నారు. హవాలా ద్వారా రూ.16 కోట్ల నగదు తరలించారనే ఆరోపణలు వచ్చింది. ఆ నగదు భార్య, కూతురు, స్నేహితులు, ఇతరులకు పంపించారని ఈడీ అభియోగాలు నమోదు చేసింది.

1.8 kg gold, crore cash seized ED at Satyendar and aides

అభియోగాలు ఎదుర్కొంటున్న ఒకరు సత్యేంద్ర జైన్‌కు చెందిన సంస్థ నుంచి భూమిని సహచరుల కుబుంబాలకు బదిలీ చేశారు. దీంతో ఈడీ దర్యాప్తు వేగిరం చేసింది. పలు డాక్యుమెంట్లు, డిజిటల్ రికార్డ్స్ కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది.

ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జైన్ ఇంటితో పాటు మరికొన్ని చోట్ల తనిఖీలు చేపట్టారు. మనీలాండరింగ్‌ కేసులో గత నెల 30న ఈడీ సత్యేంద్ర జైన్ను అరెస్టు చేసింది. కోల్కతాకు చెందిన ఓ కంపెనీకి సత్యేంద్ర జైన్ అక్రమంగా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే దర్యాప్తు సంస్థ ఏప్రిల్లో ఆయనకు సంబంధించి రూ.4.81కోట్ల విలువైన స్థిరాస్థులను జప్తు చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలపై సరైన వివరణ ఇవ్వలేదన్న కారణంతో జైన్పై క్రిమినల్ కేసు నమోదుచేసింది. ఈ నేపథ్యంలో మే 30న అరెస్టైన ఆయనను కోర్టు జూన్ 9 వరకు ఈడీ కస్టడీకి ఇచ్చింది.

English summary
Crores in cash and gold coins and bars weighing nearly two kilograms were seized by the Enforcement Directorate during searches at the premises of Delhi minister Satyendar Jain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X