పదేళ్ల బాలికపై మైనర్ బాలుడి అత్యాచారం
డెహ్రాడూన్: డెహ్రాడూన్‌లోని వసంత్ విహార్ ప్రాంతంలో పదేళ్ల బాలికపై ఓ మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని పోలీసులు శనివారంనాడు వెల్లడించారు. ఈ సంఘటన గురువారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి -
గురువారం రాత్రి బాధితురాలు సమీపంలోని దుకాణానికి వెళ్లింది. ఆ సమయంలో 16 ఏళ్ల బాలుడు ఆమెను మభ్యపెట్టి ఓ నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు శుక్రవారంనాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు పదో తరగతి చదువుతున్నాడు. బాధితురాలికి వైద్య పరీక్షలు చేయించగా, అత్యాచారం జరిగిందనే విషయం తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అతన్ని జువెనైల్ హోంకు తరలించారు.












Click it and Unblock the Notifications