Raod Accident: ఘో రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి..
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఘోరో రోడ్డు ఈ ప్రమాదంలో 11 మంది మరణించారు.
ఛత్తీస్‌గఢ్‌లోని ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. భాటాపరాలోని బలోడా బజార్‌లోని అర్జుని ప్రాంతంలో అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 11 మంది మరణించారు. లారీ, పికప్ ఢీకొన్న ఘటనలో నలుగురు చిన్నారులు సహా 11 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన ముగ్గురినీ మెరుగైన చికిత్స కోసం రాయ్‌పూర్‌కు తరలించారు.

భూపేష్ బఘెల్
ఇది భటపరా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్థరాత్రి లారీ, పికప్ వాహనం ఢీకొన్నాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ శుక్రవారం బలోడా బజార్-భటపరా రోడ్డులో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

పంక్షన్‌కు వెళ్లి
ఈ ఘటనలో క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, మృతుల కుటుంబాలకు అన్ని విధాలా సాయం అందించాలని జిల్లా యంత్రాంగం అధికారులను సీఎం బఘెల్ ఆదేశించారు.ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పికప్ వాహనంలో ఉన్నవారంతా ఓ పంక్షన్‌కు వెళ్లి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రెండు వారాల క్రితం కంకేర్ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటోను ట్రక్కు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

తమిళనాడు
తమిళనాడుని కృష్ణగిరి జిల్లా కావేరిపట్నంలో గురువారం ఘోరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో ఆరుగురు గాయపడగా.. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ట్రాక్టర్ ను మినీ బస్సు వేగంగా ఢీకొటంతో ఈ ప్రమాదం జరిగింది.












Click it and Unblock the Notifications