భారత్ లో యూకే కరోనా స్ట్రెయిన్ కేసుల కలకలం ... 114కు పెరిగిన కేసులు

భారతదేశంలో ఒకపక్క కరోనా కేసులు తగ్గుముఖం పడుతుంటే, మరోపక్క యూకే కరోనా కొత్త స్ట్రెయిన్ మాత్రం కలవరపెడుతుంది. యూకే కరోనా కొత్తరకం వైరస్ కేసులు ఈ రోజు కూడా ఇండియాలో ఐదు నమోదయ్యాయి. ఇప్పటివరకు భారత దేశంలో కరోనా కొత్తరకం కేసుల సంఖ్య 114 కి పెరగడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది.

ఇండియాలో యూకే కొత్తరకం వైరస్ కేసులు

ఇండియాలో యూకే కొత్తరకం వైరస్ కేసులు

రేపటి నుండి ఇండియాలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కరోనా మహమ్మారి కి శాశ్వతంగా చెక్ పెట్టడం కోసం ఒకపక్క ప్రయత్నం జరుగుతున్న సమయంలో మరోపక్క యూకే కరోనా కొత్త రకం వైరస్ కేసులు పెరగటం ఇబ్బంది పెడుతుంది. బ్రిటన్లో కరోనా కొత్తరకం వైరస్ వెలుగు చూసిన వెంటనే అప్రమత్తమైన భారతదేశం కొద్ది రోజుల పాటు ఆ దేశానికి విమాన సర్వీసులు నిలిపివేసినప్పటికీ , యూకే నుండి ఇండియా వచ్చినవారికి చాలామందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

ఎయిర్ పోర్ట్ లలోనే కరోనా పరీక్షలు

ఎయిర్ పోర్ట్ లలోనే కరోనా పరీక్షలు

మొదట విమాన సర్వీసులు నిలిపివేసిన కేంద్ర సర్కార్ తిరిగి జనవరి 8వ తేదీ నుండి విమాన సర్వీసులను పునరుద్ధరించడంతో యూకే నుండి ప్రయాణికుల రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే వీరందరికీ ఎయిర్ పోర్టుల లోనే కరోనా పరీక్షలు నిర్వహించి కరోనా పాజిటివ్ గా తేలిన వారి రక్త నమూనాలను వైరాలజీ ల్యాబ్ లకు పంపిస్తున్నారు .వారికి వచ్చింది కరోనా పాజిటివ్ నా ? లేక కరోనా కొత్తరకం వైరస్ నా అని నిర్ధారించుకునే పనిలో ఉన్నారు అధికారులు.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు114 మందికి కరోనా కొత్తరకం వైరస్ నిర్ధారణ

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు114 మందికి కరోనా కొత్తరకం వైరస్ నిర్ధారణ

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా114 మందికి కరోనా కొత్తరకం వైరస్ నిర్ధారణ కాగా ప్రస్తుతం వారంతా ఆయా రాష్ట్రాలలో సింగిల్ రూమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది . వారికి కరోనా చికిత్స అందిస్తున్నారు . సాధారణ వైరస్ కంటే యూకేలో వ్యాప్తి చెందిన కరోనా కొత్త రకం వైరస్ 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని ఆందోళన కొనసాగుతున్న సమయంలో కేసుల సంఖ్య పెరుగుతుండడం ఒకింత టెన్షన్ పడవలసిన అంశమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+