ఫ్లై ఓవర్ పై స్కూల్ బస్సు బోల్తా, గాయాలు

న్యూఢిల్లీ: స్కూల్ బస్సు బోల్తా పడి విద్యార్థులకు తీవ్రగాయాలైన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో విద్యార్థుల కుటుంబ సభ్యులు, ప్రయివేటు స్కూల్ యాజమాన్యం ఊపిరిపీల్చుకున్నారు.

ఉత్తర ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ వద్ద మంగళవారం ఈ సంఘటన జరిగింది. గాయాలైన విద్యార్థులను వెంటనే సమీపంలోని అరుణా ఆసఫ్ ప్రభుత్వ ఆసుపత్రి, సుశృతా ట్రామా సెంటర్ కు తరలించి చికిత్స చేయించారు. కొందరిని వేరే ఆసుపత్రికి తరలించారు.

12 children were severely injured After School Bus Overturns in New Delhi

పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో రుక్మిణి దేవి, విక్టోరియా గర్ల్స్ సీనియర్ సెకండరీ స్కూల్స్ కు చెందిన బస్సు 30 మంది విద్యార్థులను బస్సులో పిలుచుకుని బయలుదేరారు.

మార్గం మద్యలో ఐఎస్ బీటీ ఫ్లై ఓవర్ మీదుగా వెలుతున్న సమయంలో పాదచారులు అడ్డుగా వెళ్లారు. ఆ సందర్బంలో బస్సు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. బస్సు అదుపు తప్పడంతో బోల్తా పడింది. తీవ్ర గాయాలైన 12 మంది విద్యార్థులను వెంటనే ఆసుపత్రులకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+