50 వేల రూపాయలకు కన్నకూతుర్నే అమ్మిన దారుణం .. ఏపీలో మైనర్ బాలికపై ఓ తండ్రి దాష్టీకం

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి కన్న కూతుర్ని అమ్మకానికి పెట్టాడు. ముక్కుపచ్చలారని 12 ఏళ్ల బాలికను 50 వేల రూపాయలు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా అమ్మేశాడు ఓ తండ్రి. మొదట బాలికకుపెళ్లి చేద్దామని భావించిన తండ్రి, మైనర్ కు వివాహం చేయడం కుదరకపోవడంతో 50వేల రూపాయలు ఇచ్చిన ఓ 36 ఏళ్ల వ్యక్తికి కూతుర్ని అమ్మేశాడు.

చిత్తూరు జిల్లాలో తండ్రే కూతుర్ని అమ్మేసిన అమానవీయం

చిత్తూరు జిల్లాలో తండ్రే కూతుర్ని అమ్మేసిన అమానవీయం

చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ దారుణ సంఘటన విషయానికి వస్తే , చిత్తూరు జిల్లా పలమనేరు, పెద్దపంజాణి మండలం ముదరంపల్లిలో ఈ దారుణం చోటుచేసుకుంది. డబ్బుకు ఆశపడి ఓ తండ్రి కన్నబిడ్డనే అమ్మేశాడు. ముదరంపల్లి గ్రామానికి చెందిన జోగి వెంకటరమణ పందుల్నిపెంచుతూ కుటుంబ పోషణ చేసేవాడు. అతనికి నలుగురు కుమార్తెలు.ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసిన వెంకటరమణ దగ్గర 12 ఏళ్ల వయసున్న మూడో కుమార్తె ఐదో తరగతి వరకు చదివి,చదువు మానేసి ఇంటి వద్దనే ఉంటోంది.

50 వేలు తీసుకుని కూతురికి పెళ్లి చెయ్యాలని చూసిన తండ్రి

50 వేలు తీసుకుని కూతురికి పెళ్లి చెయ్యాలని చూసిన తండ్రి

ఇక ఈ క్రమంలో బైరెడ్డిపల్లి మండలం చప్పిడిపల్లికి చెందిన 36 ఏళ్ల సురేష్ అనే వ్యక్తి వెంకటరమణ కుమార్తెను పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు.వెంకటరమణ ఆసక్తి చూపించకపోవడంతో 50 వేల రూపాయలు ఇస్తాను ,తనకిచ్చి పెళ్ళి చేయాలని పట్టుబడ్డాడు. డబ్బుకు ఆశపడిన వెంకటరమణ కుమార్తెను అతనికి ఇచ్చి పెళ్లి చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. రహస్యంగా పెళ్లి చేయాలని భావించినప్పటికీ,ఈ విషయం ఆ నోటా ఆ నోటా తెలిసి పోలీసుల దాకా చేరింది. ఇక పోలీసులు వెంకటరమణ పిలిపించి మైనర్ పెళ్లి చేయొద్దని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

గుట్టుచప్పుడు కాకుండా 12 ఏళ్ల కుమార్తె అమ్మకం

గుట్టుచప్పుడు కాకుండా 12 ఏళ్ల కుమార్తె అమ్మకం

సురేష్ ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వడం ఇష్టంలేని వెంకటరమణ గుట్టుచప్పుడు కాకుండా 12 ఏళ్ల కుమార్తెను సురేష్ కి అప్పగించి పంపించేశాడు. ఇక అతను ఆ బాలికను వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చప్పిడిపల్లిలో మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న విషయాన్ని గ్రామస్తులు ఐసీడీఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ఇక రంగంలోకి దిగిన అధికారులు బాలికను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముదరంపల్లిలో వెంకటరమణ ఇంటికి వెళ్లగా అక్కడ బాలిక, వెంకటరమణ కనిపించలేదు. ఇక చప్పిడిపల్లి లోనూ బాలిక కోసం గాలిస్తున్నారు.

 బాలిక రహస్య వివాహం .. రంగంలోకి అధికారులు

బాలిక రహస్య వివాహం .. రంగంలోకి అధికారులు

12 ఏళ్ల మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న సురేష్ గతంలో వెంకటరమణ పెద్ద కుమార్తెను పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు. ఆ తర్వాత రెండో కుమార్తెని పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు. ఇక తాజాగా మూడో కుమార్తెను, ముక్కుపచ్చలారని మైనర్ బాలికను 50వేల రూపాయలు ఇచ్చి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి పైసలకు కక్కుర్తిపడి వారి బంగారు భవిష్యత్తును నాశనం చేయడం, వారి జీవితాన్ని అంధకారమయం చేయడం శోచనీయం. అసలు సురేష్ ఆ బాలికను పెళ్లి చేసుకోవటానికి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చెయ్యాల్సి ఉంది .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+