వ్యాన్-ట్రక్ ఢీకొని 13 మంది భక్తుల మృతి
రాంచి: పుణ్యక్ష్రేతాలకు వెళ్లిన భక్తులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంఘటన జార్ఖండ్ లో జరిగింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 13 మంది సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారని పోలీసు అధికారులు తెలిపారు. భీమన అమావాస్య రోజే భక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
బీహార్ కు చెందిన 15 మంది భక్తులు పూరికి వెళ్లారు. అక్కడ దైవదర్శనం చేసుకున్నారు. పరిసర ప్రాంతాలలోని పుణ్యక్షేత్రాలు సందర్శించారు. తరువాత వ్యాన్ లో బీహార్ బయలుదేరారు. మార్గం మద్యలో జార్ఖండ్ లోని జంషడ్ పూర్ సమీపంలోని ఇచావో ప్రాంతంలో భక్తులు వెళుతున్న వాహన్నాని ట్రక్ ఢీకొంది.

ఈ ప్రమాదంలో 13 మంది అక్కడే దుర్మరణం చెందారు. మృతదేహాలు రోడ్డు మీద చెల్లాచెదురుగా పడ్డాయి. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు ఆసుపత్రి దగ్గరకు బయలుదేరారు. తీవ్రగాయాలైన ఇద్దరు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారని పోలీసులు చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్ డ్రైవర్ పరారైనాడని పోలీసు అధికారులు తెలిపారు. ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని అన్నారు.












Click it and Unblock the Notifications