ఇంటికి వెళ్తూ ప్రమాదంలో 13 మంది దుర్మరణం
బెంగళూరు: మృత్యువురూపంలో వచ్చిన డీజల్ ట్యాంకర్ టాటా ఏస్ వాహనాన్ని (గూడ్స్ వాహనం) డీకొనడంతో 13 మంది దుర్మరణం చెందిన సంఘటన కర్ణాటకలోని బాగల్ కోటే జిల్లా, ముథోళ తాలుకాలోని లోకాపుర సమీపంలో జరిగింది.
ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన 7 మంది ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. శుక్రవారం రాత్రి లోకాపుర నుంచి దాదనట్టి గ్రామానికి 20 మంది కార్మికులు టాటా ఏస్ వాహనంలో బయలుదేరారు. లోకాపుర సమీపంలోని పెట్రోల్ బంక్ దగ్గర ఎదురు నుంచి వచ్చిన డీజల్ ట్యాంకర్ టాటా ఏస్ వాహనాన్ని డీకొనింది.

ఈ ప్రమాదంలో 13 మంది సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. తీవ్రగాయాలైన ఏడు మందిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డీజల్ ట్యాంకర్ డ్రైవర్ మహంతేష్ చిక్కమఠ అక్కడి నుంచి పరారైనాడు.
విషయం తెలుసుకున్న జిల్లా ఇన్ చార్జ్ మంత్రి ఎస్.ఆర్ పాటిల్, స్థానిక శాసన సభ్యుడు గోవింద కారజోళ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు.
మృత్యుల కుటుంబ సభ్యులకు రూ. లక్ష పరిహారం అందిస్తామని మంత్రి ఎస్.ఆర్. పాటిల్ చెప్పారు. ఈ ప్రమాదంలో ట్యాంకర్ పగిలిపోయి డీజల్ రోడ్డుపాలైయ్యింది. ముందు జాగ్రత చర్యగా అగ్నిమాపక సిబ్బంది రెండు వాహనాల నీటిని డీజల్ మీద చల్లారు.












Click it and Unblock the Notifications