ఘోర ప్రమాదం: లోయలోపడిన వాహనం: 13 మంది మృతి, నలుగురికి గాయాలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళుతున్న ఓ వాహనం భారీ లోయలో పడిపోవడంతో 13 మంది మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ విషాద ఘటన డెహ్రాడూన్ జిల్లాలోని చక్రతా బుల్హద్-బైలా రోడ్ వద్ద చోటు చేసుకుంది.
చక్రతా స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఎస్డీఎం) విభాగం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. పోలీసులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్డీఆర్ఎఫ్) టీం కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో భాగస్వామ్యమైంది. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
Uttarakhand: 13 people died, two rescued after a vehicle rolled down a gorge at Bulhad-Baila road in Chakrata, Dehradun district today. pic.twitter.com/jhJYNSQpKI
— ANI (@ANI) October 31, 2021
డెహ్రాడూన్ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడినవారికి రూ. 50 లక్షలు ప్రకటించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.












Click it and Unblock the Notifications