గ్రూపుల మధ్య కాల్పులు: 14 మంది నక్సల్స్ మృతి

సమాచారం అందుకున్న పోలీసులు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సిపిఐ మావోయిస్టు గ్రూప్ నుంచి వేరుపడిన నక్సలైట్లు తృతీయ ప్రస్తుతి కమిటీ (టిపిసి)గా ఏర్పడ్డారు. ఈ రెండు గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయి.
మృతులంతా టిపిసి గ్రూప్‌నకు చెందినవారని భావిస్తున్నారు. సిపిఐ మావోయిస్టు గ్రూప్‌నకు చెందిన నక్సలైట్లు మరణించడం గానీ గాయపడడం గానీ జరిగినట్లు లేదని పోలీసులు అంటున్నారు. శనివారం తెల్లవారు జామున ప్రారంభమైన కాల్పులు నాలుగు గంటల పాటు సాగాయి.
మరణించిన నక్సలైట్ల ఆయుధాలను తీసుకుని మావోయిస్టులు పారిపోయినట్లు చెబుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. దీంతో మృతదేహాలను కూడా తీసుకుని వెళ్దామని భావించిన మావోయిస్టులకు అది సాధ్యం కాలేదని సమాచారం.












Click it and Unblock the Notifications