దినకరన్ ఇంట్లో 16 మంది ఎమ్మెల్యేలు: పన్నీర్ సెల్వంకు రూ. 500 కోట్లు ఇచ్చారు !
టీటీవీ దినకరన్ ఇంటిలో 16 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం కు రూ. 500 కోట్లు ఇచ్చారు, అందుకే విలీనం ఇక్కడ ఎవ్వరూ భయపడేవారు లేరంటున్న ఆర్ధిక శాఖ మంత్రి
చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సోమవారం అన్నాడీఎంకే అమ్మ, పురట్చి తలైవి అమ్మ వర్గాల నాయకులు పళనిసామి, పన్నీర్ సెల్వం ఒక్కటి కావడానికి చకచకా పావులుకదుపుతున్నారు. ఇదే సమయంలో టీటీవీ దినకరన్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు.
అన్నాడీఎంకేలోని తన వర్గానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలతో టీటీవీ దినకరన్ చెన్నైలోని తన ఇంటిలో భేటీ అయ్యి రహస్యంగా చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వానికి పూర్తి మెజరిటీ లేకుండా చూడటానికి అవసరం అయితే మరికొంత మంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

టీటీవీ దినకరన్ ప్రధాన అనుచరుడు, ఎమ్మెల్యే వెట్రివల్ తీవ్రస్థాయిలో పళనిసామి, పన్నీర్ సెల్వం మీద విమర్శలు చేస్తున్నారు. పళనిసామి దగ్గర పన్నీర్ సెల్వం రూ. 500 కోట్లు తీసుకుని విలీనం అవుతున్నారని, వారి మద్య ముందే డీల్ కుదిరిందని ఎమ్మెల్యే వెట్రివేల్ ఆరోపణలు చేశారు.
టీటీవీ దినకరన్ బుడ్డబెదిరింపులకు ఇక్కడ ఎవ్వరూ భయపడేవారులేరని తమిళనాడు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి జయకుమార్ మండిపడ్డారు. ఇక్కడ వందల కోట్ల రూపాయలు ఎవ్వరూ ఇవ్వలేదని, ఎవ్వరూ తీసుకోలేదని స్పష్టం చేశారు. మొత్తం మీద దినకరన్ 16 మంది ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications