మరో వ్యక్తితో చనువుగా ఉంటోందని ప్రియురాలిని చంపిన ప్రియుడు
నామక్కాల్: ప్రియురాలు మరొకరితో చనువుగా ఉన్న విషయం జీర్ణించుకొలేని ప్రియుడు ఆమెను కిడ్నాప్ చేసి స్నేహితులతో కలిసి దారుణంగా హత్య చేసిన సంఘటన తమిళనాడులోని నామక్కాల్ జిల్లాలో జరిగింది. ప్రియన్నామలై గ్రామంలో 16 సంవత్సరాల బాలిక నివాసం ఉంటోంది.
ఈమె ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. బాలిక, అదే గ్రామంలో నివాసం ఉంటున్న దిలీప్ కుమార్ (20) ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. అయితే, బాలిక తన కాలేజ్ లో ఇంటర్ చదువుతున్న ఒక అబ్బాయితో చనువుగా ఉండేది.
ఈ విషయం తెలుసుకున్న దిలీప్ కుమార్ మరొకరితో చనువుగా ఉండవద్దని, మాట్లాడొద్దని ప్రియురాలిని మందలించాడు. బాలిక మాత్రం అతనితో మాట్లాడడం ఆపలేదు. దీనిపై కోపోద్రిక్తుడైన దిలీప్ కుమార్ ఎలాగైనా ప్రియురాలిని అంతం చెయ్యాలనుకున్నాడు.

గురువారం ప్రియురాలు కాలేజ్ కు వెళ్తుండగా.. గ్రామ శివార్లలో ఉన్న దిలీప్ కుమార్ తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేశాడు. నిర్జన ప్రదేశంలోకి తీసుకు వెళ్లి ఆమె గొంతు నులిమి హత్య చేశారు.
మృతదేహాన్ని గోనే సంచిలో వేసి మూట కట్టి విసిరేశాడు. సాయంత్రం అయినా బాలిక ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు, ప్రత్యేక బృందం పోలీసులు గాలించారు. నిర్జన ప్రదేశంలో బాలిక మృతదేహాన్నిగుర్తించారు.
బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ఆదారంగా దిలీప్ కుమార్ మీద అనుమానం వచ్చిందని నామక్కాల్ జిల్లా ఎస్పీ ఎస్.ఆర్ సెంథిల్ కుమార్ అన్నారు. గురువారం అర్దరాత్రి దిలీప్ కుమార్ ఇంటి మీద దాడి చేసి అతనిని అరెస్టు చేశారు. దిలీప్ కుమార్ తెలిపిన వివరాల ఆదారంగా అతని స్నేహితులు సంతోష్, 17 సంవత్సరాల ఇంటర్ విద్యార్థిని అరెస్టు చేశామని ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు.












Click it and Unblock the Notifications