ఖంగుతిన్న కస్టమ్స్ అధికారులు.. ఖర్జూరాల్లో 172 గ్రాముల బంగారం.. ఎక్కడంటే ?

విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ బంగారం పట్టుబడిన ఘటనలను నిత్యం చూస్తూనే ఉంటాం. కస్టమ్స్ అధికారులు నుంచి తప్పించుకోవడానికి పూటకో వేషం వేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఖర్జూరాల్లో బంగారాన్ని తరలించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంత‌ర్జాతీయ‌ విమానాశ్ర‌యంలో చోటు చేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎస్వీ-756 విమానంలో జెడ్డా నుంచి ఢిల్లీకి వ‌చ్చిన 56 ఏళ్ల వ‌య‌సున్న ఒక ప్ర‌యాణికుడిపై అనుమానంతో క‌స్ట‌మ్స్‌ అధికారులు త‌నిఖీ చేశారు. బ్యాగేజీ చెకింగ్ స‌మ‌యంలో అత‌ని ల‌గేజీపై అనుమానం వ‌చ్చి ఓపెన్ చేశారు. ఈ క్రమంలోనే ఖ‌ర్జూర పండ్ల సంచిని ఓపెన్ చేసి ప‌రిశీలించగా అధికారులు సైతం ఖంగుతిన్నారు. ఖర్జూరాల్లో బంగారు ముక్క‌ల‌ను అమ‌ర్చిన‌ట్లు గుర్తించారు.

172 grams of gold seized in dates Where is it

ఆ ఖ‌ర్జూర పండ్ల బ్యాగ్‌లో ఒక బంగారు చైన్ ను కూడా అధికారులు గుర్తించారు. ఖ‌ర్జూర పండ్ల‌లో దాచిన ఆ బంగారం మొత్తం 172 గ్రాములు ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు. స‌ద‌రు వ్య‌క్తిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. ఇక ఇటీవలే జమ్ము కశ్మీర్‌కు చెందిన 43, 45 ఏళ్ల వయసు గల ఇద్దరు వ్యక్తులు మిలాన్‌ నుంచి ఢిల్లీకి వచ్చారు. ఎయిర్‌పోర్ట్‌లో వారి లగేజీని, వారిని తనిఖీ చేయగా సుమారు 10 కిలోల బంగారం పట్టుబడింది.

ప్రత్యేకంగా రూపొందించిన రెండు నడుము బెల్ట్‌లో బంగారు నాణేలను ప్లాస్టిక్‌ ఎన్వలప్‌లో చుట్టి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. పట్టుబడిన పసిడి విలువ దాదాపు రూ.7.8 కోట్ల వరకూ ఉంటుందని అధికారులు తెలిపారు. వరుసగా ఈ తరహాలో బంగారాన్ని తరలించేందుకు కొత్త కొత్త టెక్నిక్ లను వారు అవలంబిస్తుండడం అధికారులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+