వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందువులే అధికం, పెరిగిన ముస్లిం, మహిళల సభ్యులు .. 17వ లోక్‌సభ హైలైట్స్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : 17వ లోక్‌సభ కొలువుదీరింది. 542 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహస్తున్నారు. అయితే గతంలో కంటే భిన్నంగా ఉంది 17వ లోక్‌సభ. విభిన్న అంశాలు కలిసి ఉన్నాయి. 1984 తర్వాత భారీ మెజార్టీ సాధించించి బీజేపీ. 303 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి .. అధికారం చేపట్టింది. దీంతోపాటు చాలా విశేషాలు ఉన్నాయి. అవేంటో చుద్దాం పదండి.

 39 శాతం ..

39 శాతం ..

542 ఎంపీల్లో 39 శాతం మంది రాజకీయ నేతలు ఉన్నారు. వీరిలో కొందరు సామాజిక సేవ చేసే వారు కూడా ఉన్నారు. గత సభలో 24 శాతం మంది మాత్రమే రాజకీయ నేతలు ఉంటే .. ఈ సారి అది 39 శాతానికి చేరడం ఊరట కలిగించే అంశం. అంటే యువత కూడా రాజకీయాలపై ఇంట్రెస్ట్ చూపించడం సానుకూలంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 హిందువులే అగ్రభాగం ..

హిందువులే అగ్రభాగం ..

17వ లోక్ సభలో హిందువులే అగ్రభాగం. 542 స్థానాల్లో బీజేపీ 303 స్థానాల్లో గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఎంపీలంతా హిందువులే ఉన్నారు. సభలో 90 శాతం మంది హిందు మతానికి చెందినవారు. అయితే బీజేపీలో అదీ 99.6 శాతంగా ఉంది. ముస్లింల సంఖ్య కూడా కాస్తా పెరిగింది. 16వ లోక్ సభలో వారు 23 మంది ఉండగా .. మరో నలుగురు పెరిగి 27 సభ్యులకు చేరింది. దీంతోపాటు ముస్లిం సామాజికవర్గం ఎక్కువగా లేని 14 నియోజకవర్గాల నుంచి సభ్యులు విజయం సాధించారు. దీంతో కుల, మతం కన్నా .. అభివృద్ధి, పార్టీ ఆధారంగా తమ నేతను ప్రజలు ఎన్నుకున్నారని అర్థమవుతుంది.

మహిళలు కూడా ..

మహిళలు కూడా ..

సభకు మరో విశేషముంది. ఆకాశంలో సగం .. అవకాశాల్లోనూ సగమని మహిళలకు పెద్దపీట వేస్తున్న పార్టీలు .. టికెట్లు కూడా ఇస్తున్నాయి. 33 శాతం రిజర్వేషన్ ప్రకారం కొన్ని పార్టీలు మహిళలకు టిక్కెట్లు కూడా కేటాయించాయి. దీంతో సభలో 78 మంది మహిళలు కొలువుదీరే అవకాశం లభించింది. సభలో వీరి ప్రాతినిధ్య 11 శాతంగా ఉంది. గత సభలో 62 మంది మహిళలు జయకేతనం ఎగరవేశారు. 2014తో 2019 పోలిస్తే మహిళల సీట్ల శాతం 14 శాతం పెరిగింది. 1951-52లో సభలో మహిళల శాతం కేవల 5 శాతం ఉండగా .. ఇప్పుడు అది 14 శాతానికి చేరడం ఊరట కలిగిస్తోంది. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందని చెప్పడానికి ఇది సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.

 రైతులు .. వ్యాపారులు .. తగ్గిన లాయర్లు

రైతులు .. వ్యాపారులు .. తగ్గిన లాయర్లు

అంతేకాదు ప్రతి 10 మంది ఎంపీల్లో ఆరుగురు పూర్తిస్థాయి రాజకీయ నాయకులు కారనే సత్యాన్ని బహిర్గతం చేసింది. 39 శాతం ఎంపీల్లో 38 శాతం మంది రైతు కుటుంబాల నుంచి రావడం విశేషం. దీంతోపాటు 23 శాతం ఎంపీలు వ్యాపారవేత్తలు కావడం విశేషం. 2014తో పోలిస్తే ఈసారి వ్యాపారుల ప్రాతినిధ్యం 3 శాతం పెరిగింది. అయితే గత సభలో లాయర్లు ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తే ఈసారి తగ్గింది. 2014లో 7 శాతం అడ్వకేట్లు ఎంపీలుగా ఉంటే ఇప్పుడు అది 3 శాతానికి చేరింది. ఇద్దరు ఎంపీలు వృత్తిరీత్యా టీచర్లు కావడం గమనార్షం. ఇక మహిళ ఎంపీలు .. పురుషుల కన్నా ఆరేళ్ల వయస్సు తక్కువగా ఉన్నారని తెలుస్తోంది. 17వ లోక్ సభలో మెజార్టీ సభ్యులంతా విద్యాధికులే. 394 మంది డిగ్రీ చేశారు. ఇదీ 73 శాతంగా ఉంది. 2014లో ఇది 75 శాతంగా ఉండగా .. 15వ సభలో 79 శాతం ఉంది. అంటే ప్రతి ఐదేళ్లకోసారి విద్యాధికులు పెరగాల్సింది పోయి ... క్రమంగా తగ్గుతున్నారు. ఇది కొంత ఆందోళన కలిగిచే అంశం.

English summary
seventeenth Lok Sabha has been elected and looks different from previous ones in many respects. It not only has the biggest majority enjoyed by a single party since 1984, it also has the highest number of women MPs ever. Interestingly, only 39 per cent of 542 MPs elected to the 17th Lok Sabha stated their profession as politics or social service. But surprisingly, the professional politicians in the Lok Sabha have registered a major jump from 24 per cent in the 16th Lok Sabha. Another 38 per cent of Lok Sabha MPs are farmers. Their share in the 16th Lok Sabha was 20 per cent. Farmers of the country must be hoping now that their brethren in the Lok Sabha would find a solution to the long-drawn farm crisis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X