మోడీ ఇచ్చిన అతిపెద్ద హామికి.. ఇప్పటికీ ఒక్క పైసా దిక్కు లేదు!

గతేడాది బీహార్ ఎన్నికల సందర్బంగా.. ఆ రాష్ట్రానికి అతిపెద్ద హామి ఇచ్చిన మోడీ దశాల వారిగా నిధులు అందుతాయని ఆ సందర్బంగా ప్రకటించారు. ఇప్పటికైతే ఒక్క పైసా కూడా విడుదల కాలేదని తెలియజేశారు.

ముంబై: గతేడాది బీహార్ ఎన్నికల్లో చతికిలపడ్డ బీజేపీ.. అక్కడ గెలవడానికి మాత్రం శతవిధాలా ప్రయత్నించింది. ఇందుకోసం ప్రధాని మోడీ సైతం రంగంలోకి దిగి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. బీహార్ ప్రజలను ప్రసన్నం చేసుకోవడం కోసం ఆ సందర్బంగా ఓ భారీ వరాన్ని మోడీ ప్రకటించారు.

ఏకంగా రూ.లక్షా 25వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీని బీహార్ రాష్ట్రానికి మోడీ ప్రకటించారు. అయితే అప్పటి ఎన్నికల్లో బీజేపీకి పరాభవం ఎదురవడంతో మోడీ సైతం ఈ హామిని మరిచిపోయినట్టున్నారు. ఎన్నికల్లో మోడీ ఇచ్చిన హామికి ఇప్పటివరకు ఒక్క పైసా కూడా కేంద్రం నుంచి విడుదల కాలేదు. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది.

18months on bihar awaits pms rs 125000cr bounty rti reply

ముంబైకి చెందిన ఆర్టీఐ యాక్టివిస్ట్ అనిల్ గల్గాలి దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేశారు. ప్రధాని మోడీ ఇచ్చిన అతిపెద్ద హామి ఏదని, ఆ హామి ఎంతవరకు నెరవేరిందని దరఖాస్తు ద్వారా ఆయన ప్రశ్నించారు. దీనిపై ఆర్థిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆనందర్ పర్మార్ స్పందించి అనిల్ గల్గాలికి వివరాలు పంపించారు.

గతేడాది బీహార్ ఎన్నికల ప్రచార సమయంలో ఆ రాష్ట్రాన్ని వెనకబడిన రాష్ట్రంగా గుర్తించి దాని అభివృద్ధి కోసం ఆగస్టు18, 2015న రూ.లక్షా 25వేల 003 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినట్లుగా అనిల్ గల్గాలి తెలిపారు. దశాల వారిగా నిధులు అందుతాయని ఆ సందర్బంగా ప్రధాని హామి ఇవ్వగా.. ఇప్పటికైతే ఒక్క పైసా కూడా విడుదల కాలేదని తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+