ఘోర రోడ్డు ప్రమాదం: 19 మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ ఈటా సమీపంలో శనివారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన లారీ- ట్రాక్టర్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 మంది అక్కడికక్కడే మరణించారు.
మరో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

ప్రమాద ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వివరించారు.
డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.












Click it and Unblock the Notifications