కన్యాకుమారిలో మోదీ, ఎన్ని వేల మంది పోలీసులు అంటే, అధికార పార్టీ వద్దంటున్నా !
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో సుమారు రెండున్నర నెలల పాటు దేశవ్యాప్తంగా దాదాపు 200కు పైగా ఎన్నికల ర్యాలీలు, రోడ్‌షోలు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ లోక్ సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ కు ముందు కన్యాకుమారిలోని ప్రసిద్ధ వివేకానంద రాక్ మెమోరియల్‌లో రెండు రోజుల పాటు ధ్యానం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారి పర్యటనను తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే వ్యతిరేకిస్తున్నా బీజేపీ వర్గాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలిసింది.
మే 30వ తేదీ గురువారం నుంచి దాదాపు 45 గంటల పాటు కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ బస చేయనున్న నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం చేసే కన్యాకుమారిలో సుమారు 2,000 మంది పోలీసులను మోహరించారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కోసం కన్యాకుమారిలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు రెండు వేల మంది పోలీసులతో పాటు, వివిధ భద్రతా సంస్థలు కన్యాకుమారిలో గట్టి నిఘా ఉంచారు.
అంతే కాదు సముద్ర సరిహద్దుల వెంబడి ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ నిఘా నిర్వహిస్తున్నాయి. 2019 ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కేదార్‌నాథ్ గుహలో ధ్యానం చేశారు. ఇప్పుడు తమిళనాడులోని కన్యాకుమారిని ఎంచుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడే ద్యానం చెయ్యడానికి సిద్దం అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానంపై తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఇదే సమయంలో తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారి బసపై ఆ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది. ఇందులో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు తీరు, పర్యాటక సీజన్‌లో దేశ, విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో కన్యాకుమారికి వస్తుండడాన్ని ప్రస్తావించారు. ఇలాంటి సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో ధ్యానం చేయడం వల్ల పర్యాటకులకు ఇబ్బంది కలుగుతుందని, ఇది ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని డీఎంకే తన పిటిషన్‌లో పేర్కొంది.
ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం కోసం పర్యాటకులు కన్యాకుమారికి రాకుండా బంద్ చెయ్యడం సబబుకాదని డీఎంకే వాదించింది. భారదదేశం దక్షిణ కొన వద్ద ఉన్న కన్యాకుమారి బీచ్‌లు గురువారం నుండి శనివారం వరకు పర్యాటకులు సంచరించకుండా ఆప్రాంతాలను అన్నీ మూసివేస్తున్నారు. కన్యాకుమారిలో ప్రయివేటు బోట్లను కూడా నడపడానికి అనుమతి లేదు. మరోవైపు ఎన్నికల చట్టం ప్రకారం ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యాన యాత్ర చేపట్టడంపై నిషేధం లేదని బుధవారం సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రధాని నరేంద్ర మోదీ ధ్యాన స్థలం కన్యాకుమారిలో స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రాంతంలోనే ఉంది. భారతదేశంలో పర్యటించిన తర్వాత భారత్‌ను అభివృద్ధి చేయాలనే కలను నేరవేర్చుకోవడానికి స్వామి వివేకానంద మూడు రోజుల పాటు ధ్యానం చేసిన అదే ప్రదేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు ధ్యానం చేయనున్నారు. స్వామి వివేకానంద జ్ఞాపకార్థం ఈ ప్రదేశానికి వివేకానంద రాక్ మెమోరియల్ అని పేరు పెట్టారు.

తూర్పు మరియు పశ్చిమ కనుమలు కలిసే భారతదేశంలోని దక్షిణ భాగం ఈ కన్యాకుమారి. అలాగే ఈ ప్రదేశం హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం యొక్క సంగమం. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడాలని కలలు కంటున్నట్లు ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అలాగే ధ్యానం చేసుకునే సమయం ముఖ్యమైన అంశంగా చేసుకున్నారు. ఆధ్యాత్మిక బస కోసం ప్రధాని నరేంద్ర మోదీ మే 30వ తేదీన మధ్యాహ్నం కన్యాకుమారి చేరుకుంటారు.
అనంతరం వివేకానంద రాక్ మెమోరియల్‌కు వెళ్లనున్నారు. మే 30వ తేదీ సాయంత్రం నుంచి జూన్ 1వ తేదీ సాయంత్రం వరకు ప్రధాని నరేంద్ర మోదీ ధ్యాన మండపంలో ధ్యానం చేయనున్నారు. ప్రధానమంత్రి ఇక్కడి ప్రసిద్ధ భగవతి అమ్మన్ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు చేసే అవకాశం ఉంది. జూన్ 1వ తేదీన సాయంత్రం కన్యాకుమారి నుంచి బయలుదేరే ముందు ప్రధాని నరేంద్ర మోదీ 133 అడుగుల ఎత్తైన తమిళ కవి తిరువల్లువర్ విగ్రహాన్ని సందర్శించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు అంటున్నాయి.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications