2.3 అడుగుల మరుగుజ్జు, 3 అడుగుల యువతితో పెళ్లి, మోడీ, యోగికి ఇన్వైట్
వివిధ సమస్యలతో కొందరు మరుగుజ్జులుగా ఉంటారు. అయితే వారికి శుభాకార్యం జరిగితే వార్తే. అవును పెళ్లి జరిగితే.. వైరల్ అవుతుంది. ఉత్తరప్రదేశ్‌లో కూడా ఒకతను వార్తల్లోకి వచ్చాడు. అతను మరో మరుగుజ్జును వివాహాం చేసుకోవడం.. అతను పెళ్లికి ప్రముఖులు మోడీ, యోగిని ఇన్వైట్ చేశారు.

ఎత్తు 2.3 అడుగులు
షామ్లీ జిల్లాకు చెందిన అజీమ్ మన్సూరి గురించే మనం చెప్పుకుంది. అజీమ్ ఎత్తు 2.3 అడుగులు. ఈ నవంబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నాడు. మ్యారెజ్ చేసుకోబోయే వధువు ఎత్తు 3 అడుగులు కావడం విశేషం. తమ పెళ్లికి ప్రధాని మోడీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరుకావాలని అజీమ్ అంటున్నాడు. డిల్లీ వెళ్లి వివాహ ఆహ్వాన పత్రిక అందిస్తానని చెబుతున్నాడు.

వెతికి వేసారి..
మరుగుజ్జు కావడంతో పెళ్లి లికూతురు కోసం చాలా సంవత్సరాలని వెతికాడట. తనకు సాయం చేయాలని పలువురు రాజకీయ నాయకులను, ప్రభుత్వ అధికారులను కూడా కలిసి విజ్ఞప్తి చేశాడు. తనకు పిల్లను చూసి పెట్టాలపి 2019లో యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను కలిశాడు. ఐదో తరగతితో చదువు ఆపేసిన మన్సూరికి చాలా సంవత్సరాల పోరాటం తర్వాత హాపూర్ గ్రామంలో వధువు దొరికింది.

గతేడాది బుషారాతో భేటీ
గతేడాది మార్చిలో 3 అడుగుల పొడవు గల బుషారాను కలిశాడు. ఆ ఏడాది ఏప్రిల్‌లో నిశ్చితార్థం జరిగింది. బుషారా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దాంతో ఈ నవంబర్ 7వ తేదీన వీరి పెళ్లి జరగనుంది. పెళ్లికి షేర్వానీ, త్రీ-పీస్ సూట్ కుట్టించుకున్నాడు. పాఠశాలలో తోటి విద్యార్థుల నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడట. షామ్లీ జిల్లాలో ఓ షాపు నడుతు కాలం వెళ్లదీస్తున్నాడు.












Click it and Unblock the Notifications