నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం: ఇద్దరు చిన్నారులు మృతి, 150కిపైగా గుడిసెలు దగ్ధం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెక్టార్ 63 సమీపంలో మురికివాడల్లో భారీ మంటలు చెలరేగడంతో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 150కి పైగా గుడిసెలు దగ్ధమైనట్లు అధికారులు వెల్లడించారు.
पिछले 1 घंटे से नोएडा सेक्टर 63 के पास बहलोलपुर गाँव में भयानक आग लगी हुई है।
— Abhinav Yadav (@AbhinavYadav26) April 11, 2021
फायरब्रिगेड की गाड़ी अभी तक नहीं पहुंची!! @noidapolice @Uppolice pic.twitter.com/TsufCwdOdZ
ఈ అగ్ని ప్రమాదంతో బహ్లోల్‌పూర్ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది సుదీర్ఘంగా శ్రమించి మంటలను ఆర్పివేశాయి. ప్రమాదానికి సంబంధించిన వీడియోలను పలువురు స్థానికులు సోషల్ మీడియాలో పంచుకున్నారు.

అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియోను నోయిడా గౌతమ్ బుద్ధనగర్ పోలీస్ కమిషనర్ ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. నోయిడా పోలీస్ స్టేషన్ ఏరియా 3 పరిధిలో బహ్లోల్‌పూర్ గ్రామంలో మంటలు చెలరేగాయి. తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పివేశాయి అగ్నిమాపక సిబ్బంది. అయితే, ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
Fire infront of gaur city Maine gate @PANKAJPARASHAR_ @aviral_sunil @mayank_tawer @NaveenBhati_ @siddharth2596 @NoidaMediaClub @Dkumarchandel pic.twitter.com/0sig3WXC2d
— Media connect Residents initiative of noida extn (@Mediaconnect3) April 11, 2021












Click it and Unblock the Notifications