ఇద్దరు విద్యార్థుల ప్రాణం తీసిన బస్సు: కోల్‌కతాలో ఉద్రిక్తత
కోల్‌కతా : పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతా మహానగరంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్రాసింగ్ వద్ద బస్సు సిగ్నల్ జంప్ చేసిన ఇద్దరు విద్యార్థులపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు ఆ మార్గంలో వెళ్తున్న మూడు ఆర్టీసీ బస్సులకు నిప్పుపెట్టారు.
హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేశారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. పోలీసులపై ఎదురుదాడికి దిగిన స్థానికులు రాళ్లదాడికి దిగారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు.

మంటలను ఆర్పేందుకు ఫైరింజన్లు రాగా స్థానికులు వాటిపై కూడా రాళ్లు విసిరారు.
పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ఆందోళనకారులపై టియర్‌గ్యాస్‌ను ప్రయోగించారు.
ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. ఇప్పటికే పలుమార్లు ప్రమాదాలు చోటు చేసుకున్నా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్‌లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
36 రోజులపాటు ఇంటర్నెట్ బంద్.. సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications