హుగ్లీలో బాంబు పేలుడు: ఇద్దరికి తీవ్ర గాయాలు
కోల్‌కత్తా: గురువారం ఉదయం సంభవించిన బాంబు పేలుడు ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని బాలాగడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుప్తిపారాలోని మార్కెట్‌లో ఈ బాంబు పేలుడు ఘటన సంభవించింది.

మార్కెట్‌లోని ఓ హార్డ్‌వేర్ షాపు ముందు పెట్టిన పాతబడిన క్యాన్‌ను పక్కకు పెట్టిన సందర్భంలో ఒక్కసారిగా ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో ఎవరైతే షాపుని ఓపెన్ చేసేందుకు వచ్చాడో తపస్ రాజబంగ్షీతో పాటు నితాయ్ దాస్ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే బాలాగడ్ ప్రైమరీ ఆసుపత్రికి తరలించారు. ఈ బాంబు పేలుడు ఘటనతో భయభ్రాంతులకు గురైన పలువురు దుకాణం దారులు షాపులు మూసివేశారని, మరికొందరు షాపులు తెరవలేదని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications