ఘోరం: కదులుతున్న వాహనంలో తండ్రి కళ్లెదుటే కూతుళ్లపై గ్యాంగ్‌రేప్

Subscribe to Oneindia Telugu

అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు బాలికలను వారి కన్నతండ్రి ముందే కదులుతున్న వాహనంలోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు దుర్మార్గులు. గుజరాత్‌లోని దాహోద్‌ జిల్లా బరియా తహ్‌సిల్‌ దేవ్‌గఢ్‌లో ఈ ఘటన జరిగింది.

gangrape

ఈ కేసులో 13 మందిపై అపహరణ, అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు.. ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. కుమత్‌బరియా, గోప్‌సిన్హ్‌ బరియా అనే ఇద్దరు భుట్‌పగ్లా గ్రామానికి చెందిన 13, 15 ఏళ్ల వయస్సు గల అక్కాచెల్లెళ్లపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

కుమత్‌బరియా కుమారుడు ఓ మద్యం కేసులో అరెస్టు కావడానికి బాలికల తండ్రే కారణమని ఆగ్రహించి ఈ పని చేశామని నిందితులు బెదిరించినట్లు బాలికల తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ ఘటనలో పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a shocking incident, two teenage girls were allegedly gang-raped by six men in front of their father in a moving vehicle in Devgadh Baria tehsil of Dahod district in Gujarat today, police said.
Please Wait while comments are loading...