Women: పుట్టగొడుగుల కోసం, ఇద్దరు మహిళల దారుణ హత్య, ఏంజరిగింది ?, ఎలా ?
చెన్నై/ అరియలూరు: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఇద్దరు మహిళలు పొలంలో పుట్టగొడుగులు కొయ్యడానికి ఇంటి నుంచి బయలుదేరి వెళ్లారు. గ్రామం సమీపంలోని పొలం దగ్గర ఇద్దరు మహిళలు పుట్టగొడుగులు కోస్తున్న విషయం అటువైపు వెలుతున్న గ్రామస్తులు గమనించారు. రాత్రి అయినా ఇద్దరు మహిళలు ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు, గ్రామంలోని యువకులు మహిళల కోసం గాలించారు. అటవి ప్రాంతంలో ఇద్దరు మహిళలు దారుణహత్యకు గురై శవమై కనిపించడం కలకలం రేపింది.

ఒకే గ్రామంలో నివాసం
తమిళనాడులోని అరియలూరు జిల్లాలోని పెరియవలయంలోని కలైమణి అనే ఆపరేటర్ నివాసం ఉంటున్నాడు. కలైమణికి మలర్విజి (29) అనే భార్య ఉంది. ఇదే ప్రాంతంలో కోదండపాణి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కోదండపాణి అలియాస్ దండపాణికి కన్నగి (40) అనే భార్య ఉంది. కోదండపాణి భార్య కన్నగి, కలైమణి భార్య మలర్విజి స్నేహితులు.

పుట్టగొడుగుల కోసం వెళ్లిన లేడీస్
కన్నగి, మలర్విజి ఇద్దరూ గ్రామం సమీపంలోని పొలాల్లో పుట్టగొడుగులు కొయ్యడానికి ఇంటి నుంచి బయలుదేరి వెళ్లారు. గ్రామం సమీపంలోని పొలం దగ్గర కన్నగి, మలర్విజి కలసి పుట్టగొడుగులు కోస్తున్న విషయం అటువైపు వెలుతున్న గ్రామస్తులు గమనించారు. తరువాత రాత్రి అయినా మలర్విజిలు ఇంటికి చేరుకోకపోవడంతో వాళ్ల కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

ఇద్దరు మహిళల దారుణ హత్య
కుటుంబ సభ్యులు, గ్రామంలోని యువకులు కనపడకుండా పోయిన కన్నగి, మలర్విజిల కోసం గాలించారు. అటవి ప్రాంతంలో కన్నగి, మలర్విజి దారుణహత్యకు గురై శవమై కనిపించడంతో వాళ్ల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు హడలిపోయారు. మహిళల కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంత పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లారు.

నగల కోసం చంపేశారా ?, లేక ఏమైనా
ఇద్దరు మహిళలను హత్య చేసిన నిందితులు వారి శరీరం మీద ఉన్న ఆరు తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. నగల కోసం మహిళలను హత్య చేశారా ? మరేమైనా కారణాలు ఉన్నాయా ? అని ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. ఒకే గ్రామంలో నివాసం ఉంటున్న ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురికావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications