రోడ్డు ప్రమాదం: పెళ్లి బృందంలో 20మంది మృతి
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళుతున్న బస్సు హోషంగాబాద్ ప్రాంతంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 20మంది మృతిచెందగా, మరో 25మంది గాయాలపాలయ్యారు.
గాయపడ్డ వారిని హోషాంగాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. గాయపడిన వారి పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉందని వైద్యులు తెలిపారు.

బస్సులో మొత్తం 50మంది ప్రయాణికులున్నారు. మృతి చెందిన 20మందిలో 8మంది మహిళలు, పదేళ్ల బాలుడు కూడా ఉన్నాడని హోషాంగాబాద్ కలెక్టర్ తెలిపారు.
రోడ్డు ప్రమాదం: విద్యార్థులకు గాయాలు
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఓ స్కూల్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20 మంది స్కూల్ విద్యార్థులకు గాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications