మణిపూర్ కు ప్రతిపక్ష కూటమి ఎంపీలు - ఉత్కంఠ..!!

విపక్ష కూటమి ఇండియా ఎంపీలు మణిపుర్​లో పర్యటించనున్నారు. 20 మందికిపైగా ఎంపీలు ఉండే ఈ బృందం ఈ రోజు, రేపు మణిపూర్‌ లో పర్యటించనుంది. రెండ్రోజుల పాటు అక్కడ నెలకొన్న పరిస్థితులను ఈ బృందం పరిశీలించనుంది. వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు, నాయకులతో భేటీ కానున్నది. అలాగే పునరావాస కేంద్రాలను సందర్శించి అక్కడి వాస్తవ పరిస్థితులను బృందం తెలుసుకుంటుంది. దీంతో ఉత్కంఠ కొనసాగుతోంది.

మణిపూర్ కు విపక్ష ఎంపీలు: హింసాత్మకత ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌ను విపక్ష 'ఇండియన్‌ నేషనల్‌ డెవల్‌పమెంటల్‌ ఇంక్లూసివ్‌ అలయన్స్‌' (ఇండియా)కు చెందిన ఎంపీల బృందం సందర్శించనుంది 20 మందికిపైగా ఎంపీలు ఉండే ఈ బృందం ఈ రోజు, రేపు మణిపూర్‌ లో పర్యటిస్తోంది.. రెండ్రోజుల పాటు అక్కడ నెలకొన్న పరిస్థితులను ఈ బృందం పరిశీలించనుంది.

20 Member INDIA Delegation to visit violence hit Manipur on July 29,20

మరోవైపు మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ఆగడంలేదు. గురువారం బిష్ణుపూర్‌ జిల్లాలోని మొయిరాంగ్‌లో రెండు ప్రత్యర్థి వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తుపాకులతో పరస్పరం కాల్పులకు తెగబడ్డారు. అనేక ఇళ్లను దహనం చేశారు. కాగా ఇద్దరు కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన కేసును సీబీఐ విచారించనుంది.

16 పార్టీలు..20 మంది ఎంపీలు: ఈ బృందంలో16 పార్టీలకు చెందిన 20 మంది ఎంపిలు ఉన్నారు. ఎంపిలు అధిర్‌ రంజన్‌ చౌదరి, గౌరవ్‌ గొగోరు, ఫూలో దేవి నేతమ్‌ (కాంగ్రెస్‌), లాలన్‌ సింగ్‌, అనిల్‌ ప్రసాద్‌ హెగ్డే (జెడియు), సుస్మితా దేవ్‌ (టిఎంసి), కనిమొళి (డిఎంకె), ఎఎ రహీం (సిపిఎం), సంతోష్‌ కుమార్‌ (సిపిఐ), మనోజ్‌ కుమార్‌ ఝా (ఆర్‌జెడి), జావేద్‌ అలీ ఖాన్‌ (ఎస్‌పి), పి.పి మహ్మద్‌ ఫైజల్‌ (ఎన్‌సిపి), ఈ.టి మహ్మద్‌ బషీర్‌ (ఎన్‌సిపి), ఎన్‌కె ప్రేమ్‌ చంద్రన్‌ (ఆర్‌ఎస్‌పి), సుశీల్‌ గుప్తా (ఆప్‌), అరవింద్‌ సావంత్‌ (శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే)), రవి కుమార్‌, తిరుమావళవన్‌ (విసికె), జయంత్‌ చౌదరి (ఆర్‌ఎల్‌డి), మహువా మజీ (జెఎంఎం) ఈ బృందంలో ఉన్నారు.

రెండు రోజుల పాటు ఈ ఎంపిలు సహాయక శిబిరాలు, హింసాత్మక ప్రాంతాలకు వెళ్లి బాధితులతో పాటు వివిధ గ్రూపులకు ప్రజలను కలుసుకుంటారు.

20 Member INDIA Delegation to visit violence hit Manipur on July 29,20

రెండు ప్రాంతాల్లో పర్యటన: లోయ, పర్వత రెండు ప్రాంతాల్లో బృందం పర్యటించనుంది. ఇప్పటికే మణిపూర్‌ను కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ఎంపిలు హైబీ ఈడెన్‌, డిన్‌ కురియాకోస్‌, సిపిఎం, సిపిఐ ఎంపిలు జాన్‌ బ్రిట్టాస్‌, బికాష్‌ రంజన్‌ భట్టాచార్య, బినరు విశ్వం, సంతోష్‌ కుమార్‌, సుబ్బరామన్‌ .బృందం, కేరళ కాంగ్రెస్‌ ఎంపి జోషి కె. మణి నేతృత్వంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ బృందంతో పాటు వివిధ ప్రజా సంఘాలు సందర్శించాయి.

మహి ళలను నగ్నంగా ఊరేగిస్తూ వీడియో తీసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశంపై పార్లమెంట్ లో నిరసన లు హోరెత్తుతున్నాయి. ప్రధాని మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాయి. విపక్ష కూటమి ఎంపీల పర్యటన వేళ ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+