వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ గ్యాంగ్ రేప్: ఐదుగురు దోషులు, 17న శిక్ష ఖరారు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

2010 Dhaula Kuan gang-rape case: All 5 accused convicted
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ధౌలా క్వాన్ ప్రాంతంలో నాలుగేళ్ల క్రితం జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఢిల్లీ సెషన్స్ కోర్టు దోషులను నిర్దారించింది. ఐదుగురు దోషులకు ఈ నెల 17న శిక్ష ఖరారు చేయనున్నట్లు ప్రకటించింది.

పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం 2010 నవంబర్ 24వ తేదీన కాల్ సెంటర్‌లో ఉద్యోగం చేసే ఈశాన్య రాష్టాలకు చెందిన 30 ఏళ్ల మహిళ సాయంత్రం నడిచి ఇంటికి వెళుతుండగా ఐదుగురు వ్యక్తులు ఆమెపై మంగోల్‌పురి ప్రాంతంలో సామూహిక అత్యాచారానికి పాల్పడి నిర్మానుష్య ప్రాంతంలో ఆమెను పడేసి వెళ్లిపోయారు.

ఆ తర్వాత ఈ ఐదుగురిని హర్యానాలోని మేవాట్‌‌లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణ సమయంలో మేము అమాయకులమని, ఎవరో కావాలనే ఈ కేసులో మమ్మల్ని ఇరికించారని వెల్లడించినట్లు పోలీసులు చెప్పారు.

ఈ కేసులో ఐదుగురు నిందితులైన శంషాద్ ఆలియాస్ కుటకన్, ఉస్మాన్ అలియాస్ ఖాలీ, షాహిద్ అలియాస్ ఛోటా బిల్లి, ఇక్బాల్ అలియాస్ బడా బిల్లి, కమ్రుద్దిన్‌లను నేడు దోషులుగా ఢిల్లీ సెషన్స్ కోర్టు జడ్జి వీరేందర్ భట్ నిర్దారించారు.

ఈ సంఘటన జరిగిన తర్వాత న్యూఢిల్లీలోని నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో ఉన్న కాల్ సెంటర్ కంపెనీలు తమ ఉద్యోగస్తులను సెక్యూరిటీతో పాటుగా ఇంటి వరకు దిగబెడుతున్నాయి.

English summary
A trial court on Tuesday convicted five men in the 2010 abduction and gang-rape case of a call centre employee in Dhaula Kuan area of south Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X