వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళ ఎన్నికలు: మొదటికే మోసం (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/చెన్నై: తమిళనాడు శాసన సభ ఎన్నికల సందర్బంగా ఇతర రాష్ట్రాల నాయకులతో ప్రచారం చేయించాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నిర్ణయించింది. కర్ణాటక నుంచి కొందరు సీనియర్ నాయకులను రంగంలోకి దింపుతున్నది.

చిక్కమగళూరుకు చెందిన సీ.టి. రవి నేతృత్వంలోని ప్రత్యేక టీం తమిళనాడులో ప్రచారం చేస్తారని బీజేపీ నాయకులు అంటున్నారు. బీజేపీ నాయకులు సీ.టి. రవి తదితరులకు పలు సూచనలు సలహాలు ఇస్తున్నారు.

తమిళనాడులో ప్రచారం చెయ్యాలంటే హిందీ, ఇంగ్లీష్ బాషలు పనికిరావని, కచ్చితంగా తమిళం నేర్చుకోవాలని సూచించారు. అంతే సీ.టి. రవి తదితరులు తమిళం నేర్చుకోవడానికి ప్రత్యేకంగా ట్యూషన్ చెప్పించుకుంటున్నారు.

ఫలితం మాత్రం శూన్యం

ఫలితం మాత్రం శూన్యం

కర్ణాటక నుంచి బీజేపీ నాయకులు తమిళనాడు వెళ్లి ప్రచారం చెయ్యడం శుద్ద దండగ. అనేక సంవత్సరాల నుంచి రెండు రాష్ట్రాల మధ్య కావేరి నీటి వివాదం ఉన్న విషయం తెలిసిందే.

సీనియర్ నాయకులు ఉన్నారు

సీనియర్ నాయకులు ఉన్నారు

కర్ణాటకలో బీజేపీకి చెందిన ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరు కేంద్ర మంత్రులుగా పని చేస్తున్నారు.

తప్పటడుగులు వేస్తున్న బీజేపీ

తప్పటడుగులు వేస్తున్న బీజేపీ

తమిళనాడు శాసన సభ ఎన్నికల ప్రచారానికి కర్ణాటకలోని నాయకులను పంపించడమే పెద్ద పొరపాటు.

జయలలిత కేసు ఎఫెక్ట్

జయలలిత కేసు ఎఫెక్ట్

జయలలిత అక్రమాస్తుల కేసు దర్యాప్తు బెంగళూరులో జరిగిన విషయం తెలిసిందే. తరువాత ఆమెకు జైలు శిక్ష విధించడం, తరువాత కర్ణాటక హై కోర్టు సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టి వెయ్యడం జరిగింది.

సుప్రీంకు వెళ్లిన కర్ణాటక

సుప్రీంకు వెళ్లిన కర్ణాటక

జయలలిత కేసును సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో తమిళ సోదరులు కర్ణాటక మీద ఇప్పటికే గుర్రుగా ఉన్నారు.

వెంకయ్య నాయుడు అయితే ఓకే

వెంకయ్య నాయుడు అయితే ఓకే

తమిళనాడు శాసన సభ ఎన్నికల ప్రచారానికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అయితే ఓకే. వెంకయ్య నాయుడు క్రిష్ణగిరి, ధర్మపురి, సేలం, కోయంబత్తూరు, చెన్నై నగరాలలోని తెలుగు వారిని ఆకట్టుకునే ప్రయత్నం చెయ్యడానికి అవకాశం ఉంది.

ఖర్చులు తప్పా ఓట్లు మాత్రం పడవు

ఖర్చులు తప్పా ఓట్లు మాత్రం పడవు

కర్ణాటకకు చెందిన బీజేపీ నాయకులు తమిళనాడు వెళ్లి ప్రచారం చేస్తే ఖర్చులు తప్పా ఎలాంటి ప్రయోజనం ఉండదు. బీజేపీకి ఓట్లు వేసే వారు సైతం రివర్స్ అయ్యే అవకాశం ఉంది.

రెండు శాతం ఓట్లు

రెండు శాతం ఓట్లు

తమిళనాడులో బీజేపీకి రెండు శాతం ఓటు బ్యాంక్ ఉంది. ఇప్పుడు కర్ణాటక నాయకులు అక్కడ అడుగు పెడితే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు.

జయ, విజయ్ కాంత్ మీద ఆశలు

జయ, విజయ్ కాంత్ మీద ఆశలు

తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో జయలలిత లేదా విజయ్ కాంత్ కలిసి పోటీ చెయ్యాలని బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ ఇద్దరి నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు.

ఆర్ఎస్ఎస్ సూచనలు

ఆర్ఎస్ఎస్ సూచనలు

ఆర్ఎస్ఎస్ నాయకుల సూచన మేరకే తమిళనాడులో కర్ణాటకకు చెందిన నాయకులు ప్రచారం చెయ్యడానికి సిద్దం అయ్యారని సమాచారం.

English summary
Karnataka former Minister CT Ravi and team, Tamil Nadu Assembly Election Campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X