కల్తీ మద్యానికి 21 మంది బలి... పిట్టల్లా రాలిపోతున్న జనం... విచారణకు ఆదేశించిన సీఎం...
పంజాబ్‌లో దారుణం జరిగింది. కల్తీ మద్యం సేవించిన 21 మంది మృతి చెందారు. అమృత్‌సర్,బతాలా,తర్న్ తరన్ జిల్లాల్లో బుధవారం రాత్రి ఈ మరణాలు చోటు చేసుకున్నాయి. కల్తీ మద్యం మరణాలను తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ దీనిపై విచారణకు ఆదేశించారు. కల్తీ మద్యం సేవించి జనం పిట్టల్లా రాలుతుండటంతో రాష్ట్రంలో కలకలం రేగుతోంది. కల్తీ మద్యం మూలాలను పెకిలించివేయాలని... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

డీజీపీ ఏమన్నారు...
పంజాబ్ డీజీపీ దినకర్ గుప్తా మాట్లాడుతూ... కల్తీ మద్యం కారణంగా అమృత్‌సర్‌లోని ముచ్చల్,తంగ్రా గ్రామాల్లో మొదట జూలై 29న ఐదు మంది చనిపోయినట్లు తెలిపారు. అదే ముచ్చల్ గ్రామంలో గురువారం(జూలై 30) సాయంత్రం మరో ఇద్దరు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. రాత్రి మరో ఇద్దరు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గురువారం బతాలా జిల్లాలోనూ కల్తీ మద్యం సేవించి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

విచారణకు ఆదేశించిన సీఎం....
శుక్రవారం బతాలా జిల్లాలో మరో ఐదుగురు మృతి చెందడంతో అక్కడ మొత్తం మృతుల సంఖ్య 7కి చేరినట్లు డీజీపీ తెలిపారు. అలాగే తర్న్ తరన్ జిల్లాలో నలుగురు మృతి చెందినట్లు తెలిపారు. మొత్తంగా కల్తీ మద్యం సేవించి మూడు జిల్లాల్లో 21 మంది మరణించారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ దీనిపై జలంధర్ డివిజనల్ కమిషనర్‌తో న్యాయ విచారణకు ఆదేశించారు. ఈ మరణాలకు సంబంధించి డివిజనల్ కమిషనర్ నిజ నిర్దారణ చేపట్టనున్నారు. పంజాబ్ జాయింట్ ఎక్సైజ్,టాక్సేషన్ కమిషనర్,ఎస్పీ కూడా డివిజనల్ కమిషనర్‌తో పాటు నిజ నిర్దారణ బృందంలో సభ్యులుగా ఉంటారు.

ఒకరి అరెస్ట్...
విచారణ విషయంలో డివిజనల్ కమిషనర్‌కు ముఖ్యమంత్రి పూర్తి స్వేచ్చనిచ్చారు. విచారణ వేగవంతంగా పూర్తి చేయడానికి ఏ పోలీస్ అధికారి లేదా నిపుణుల సహకారం తీసుకునేందుకు అనుమతినిచ్చారు. మరోవైపు కల్తీ మద్యం ఘటనకు సంబంధించి ముచ్చల్ గ్రామానికి చెందిన బల్వీందర్ కౌర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై సెక్షన్ 304,ఎక్సైజ్ చట్టాల కింద కేసు నమోదు చేశారు. కల్తీ మద్యం మృతులు జస్వీందర్ సింగ్,కశ్మీర్ సింగ్,కృపాల్ సింగ్,జశ్వంత్ సింగ్‌ల మృతదేహాలకు శుక్రవారం(జూలై 30) పోస్టుమార్టమ్ నిర్వహించినట్లు డీజీపీ తెలిపారు.
Recommended Video

మృతులు వీరే...
కల్తీ మద్యం సేవించి మృతి చెందినవారి వివరాలను ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇందులో ముచ్చల్ గ్రామానికి చెందిన మంగల్ సింగ్,దల్బీర్ సింగ్,గుర్‌ప్రీత్ సింగ్,కశ్మీర్ సింగ్,కాకా సింగ్,కృపాల్ సింగ్,జోగా సింగ్ ఉన్నారు. అలాగే బతాలాకు చెందిన బుటా రామ్,భిండా,రికూ సింగ్,కలా కలు,బిల్లా,జతీందర్ ఉన్నారు. తంగ్రాకు చెందిన బల్‌దేవ్ సింగ్,తర్న్ తరన్‌కి చెందిన సాహిబ్ సింగ్,హర్బన్ సింగ్,సుఖ్‌దేవ్ సింగ్,ధరమ్ సింగ్ ఉన్నారు.
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!












Click it and Unblock the Notifications