Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అంతుబట్టని వైరస్, ఇన్‌ఫెక్షన్: గిర్‌ అడవుల్లో 18రోజుల్లో 21 సింహాల మృతి

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని‌ గిర్ అభయారణ్యంలో గుర్తు తెలియని వైరస్, ఇన్‌ఫెక్షన్ల కారణంగా మృతి చెందుతున్న సింహాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఏం చేయాలో తెలియక అధికారులు ఆందోళన చెందుతున్నారు.

గడచిన 18 రోజుల వ్యవధిలో 21 సింహాలు మరణించినట్టు గుర్తించిన అధికారులు తెలిపారు. వీటిలో నాలుగు సింహాలు వైరస్‌తో, ఆరు సింహాలు ప్రొటోజోవా ఇన్‌ఫెక్షన్ తో మరణించాయని భావిస్తున్నట్టు తెలిపారు. పురుగుల ద్వారా ఈ ఇన్ ఫెక్షన్ వ్యాపిస్తోందని నిర్ధారించారు.

21 Lion Deaths In 18 Days At Gir, Shocker Blamed On Disease, Fights

దల్ఖానియా రేంజ్ ప్రాంతంలో ఇన్‌ఫెక్షన్ ప్రభావం అధికంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలోని పలు సింహాలు అనారోగ్యంతో ఉన్నాయని గుర్తించామని, వాటిని రెస్క్యూ కేంద్రానికి తరలించి చికిత్సను అందిస్తున్నామని తెలిపారు.

మరణించిన సింహాల కళేబరాల్లో తమకు కనిపించిన వైరస్ ఏంటన్న విషయాన్ని పరిశీలిస్తున్నామని వైద్యులు తెలిపారు. మిగతా సింహాలకు వైరస్ సోకకుండా యూఎస్ నుంచి వాక్సిన్ ను తెప్పిస్తున్నామని గుజరాత్ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా, గిర్ అడవుల్లో 2015 గణన ప్రకారం 520 సింహాలున్నాయి. మనదేశంలో గిర్ అడవులు సింహాలకు అతి పెద్ద ఆవాసంగా గుర్తింపు పొందింది.

More From
Prev
Next
Read in English: Gir lion death spikes
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+