Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఆపరేషన్.. 22 మంది మావోయిస్టులు హతం

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ లోని దండకారణ్యంలో మరోసారి కాల్పుల మోత మోగింది. బీజాపూర్-దంతెవాడ సరిహద్దుల్లో భద్రతా బలగాలు జరిపిన ఎన్ కౌంటర్ లో చాలా మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్-దంతెవాడు భద్రతా దళాలు మావోయిస్టులపై దాడి చేసి రెండు వేర్వేరు ఆపరేషన్లలో 22 మందిని హతమార్చాయి. ఈ భారీ ఆపరేషన్ సమయంలో ఒక సైనికుడు కూడా వీరమరణం పొందాడు. ఎన్ కౌంటర్ స్థలం నుంచి భద్రతా దళాలు భారీ మొత్తంలో ఆయుధాలు, మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.

బీజాపూర్-దంతెవాడ జిల్లాల సరిహద్దులోని దట్టమైన అడవుల్లో నక్సల్స్ ఉన్నట్లు సమాచారం మేరకు జిల్లాల నుంచి సంయుక్త బలగాలు అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. గురువారం ఉదయం బీజాపూర్, దంతెవాడ సరిహద్దులోని గంగలూరు పోలీస్ స్టేషన్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాల బృందం నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్‌కు బయలుదేరిందని అధికారులు తెలిపారు. ఇరువర్గాల మధ్య ఇంకా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. భద్రతా దళాలు బీజాపూర్‌లో 18 మంది నక్సలైట్లను, కాంకేర్‌లో నలుగురు నక్సల్స్ ను హతమార్చింది. ఈ ఎన్‌కౌంటర్‌లో బీజాపూర్ డీఆర్‌జీకి చెందిన ఒక సైనికుడు అమరుడయ్యాడు. శోధన ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.

22 Maoists Killed in Chhattisgarh Encounter

ఎన్‌కౌంటర్ స్థలం నుంచి 18 మంది నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే, సంఘటనా స్థలంలో పెద్ద మొత్తంలో ఆయుధాలు,మందుగుండు సామగ్రిని కనుగొన్నారు, వాటిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇంకా శోధన ఆపరేషన్ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+