వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై 25లక్షల రివార్డ్, దావూద్ సహచరులపైనా ఎన్ఐఏ రివార్డులు!!

|
Google Oneindia TeluguNews

అంతర్జాతీయ గ్యాంగ్ స్టర్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం భారత్ టార్గెట్ గా చేసిన కుట్రలపై ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ 25 లక్షల రూపాయల నగదు రివార్డును ప్రకటించింది. అతని సహచరులు అయిన చోటా షకీల్ పై 20 లక్షలు అనీష్, చిక్నా, మెమన్ ఒక్కొక్కరిపై పదిహేను లక్షల రూపాయల చొప్పున నగదు రివార్డును ప్రకటించినట్టు ఎన్ఐఏ వెల్లడించింది.

దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ పై రివార్డ్ లను ప్రకటించిన ఎన్ఐఏ

దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ పై రివార్డ్ లను ప్రకటించిన ఎన్ఐఏ


'డి' కంపెనీ - ఇబ్రహీం గ్యాంగ్ - భారతదేశంలో స్మగ్లింగ్ చేయడానికి స్థాపించిన యూనిట్ ఉగ్రవాద కార్యాకలాపాలతో భారత్ లో విధ్వంసం సృష్టించటం కోసం పనిచేస్తుందని గుర్తించి నమోదు చేసిన కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా ఈ రివార్డులను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది. డీ కంపెనీ ఇబ్రహీం గ్యాంగ్ దేశంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డ్రగ్స్ మరియు నకిలీ భారతీయ కరెన్సీ నోట్లు (ఎఫ్‌ఐసిఎన్) మరియు పాకిస్తాన్ ఏజెన్సీలు మరియు ఉగ్రవాద సంస్థలతో సన్నిహితంగా ఉంటూ ఉగ్రదాడులకు పాల్పడుతున్నాయని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు.

ఇప్పటికే దావూద్ పై ఐక్యరాజ్యసమితి రివార్డు

ఇప్పటికే దావూద్ పై ఐక్యరాజ్యసమితి రివార్డు


జాతీయ దర్యాప్తు ఏజెన్సీ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీం అలియాస్ హాజీ అనీస్‌కు సైతం రివార్డును ప్రకటించింది. దావూద్ అనుచరులు జావేద్ పటేల్ అలియాస్ జావేద్ చిక్నా, షకీల్ షేక్ అలియాస్ ఛోటా షకీల్, మరియు ఇబ్రహీం ముస్తాక్ అబ్దుల్ రజాక్ మెమన్ అలియాస్ టైగర్ మెమన్ లపై కూడా నగదు రివార్డులను ప్రకటించి దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే దావూద్ ఇబ్రహీం పై ముంబై వరుస పేలుళ్ల కేసులో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 2003లో 25 మిలియన్ల డాలర్ల బహుమానం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఉగ్రవాద సంస్థలతో దావూద్ ఇబ్రహీంకు లింకులు

ఉగ్రవాద సంస్థలతో దావూద్ ఇబ్రహీంకు లింకులు

పాకిస్థాన్‌లోని కరాచీలో ఉండి, 1993 ముంబై వరుస పేలుళ్లతో సహా భారతదేశంలోని అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడని ఇబ్రహీం ఇప్పుడు దేశం లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారిన నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ ను పట్టుకోవడం కోసం రకరకాలుగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. (ఎల్‌ఈటీ) చీఫ్ హఫీజ్ సయీద్, జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్, హిజ్బుల్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు సయ్యద్ సలావుద్దీన్, అతని సన్నిహితుడు అబ్దుల్ రవూఫ్ అస్గర్ తదితరులు డి కంపెనీ ద్వారా రాజకీయ నేతలను టార్గెట్ చేయడానికి డీల్ చేసుకున్నట్టు సమాచారం.

ఉగ్రవాద గ్రూపులతో కలిసి భారత్ లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసిన దావూద్

ఉగ్రవాద గ్రూపులతో కలిసి భారత్ లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసిన దావూద్

ఉగ్రవాద గ్రూపులు, పాక్ గూఢచారి సంస్థ - ఐఎస్‌ఐ సాయంతో భారత్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిందని సమాచారం అందుకున్న ఎన్‌ఐఎ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇబ్రహీం మరియు అతని సహాయకులపై కేసు నమోదు చేసింది. వ్యాపారవేత్తలను టార్గెట్ చెయ్యటానికి, అలాగే భారతీయ నగరాల్లో దాడులు చేసేందుకు లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ మరియు అల్-ఖైదా యొక్క టెర్రర్ మరియు స్లీపర్ సెల్స్‌కు దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ మద్దతు ఇస్తున్నారని ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే 29 చోట్ల ఎన్ఐఏ దాడులు.. ఈడీ విచారణ

ఇప్పటికే 29 చోట్ల ఎన్ఐఏ దాడులు.. ఈడీ విచారణ


విచారణలో భాగంగా, హాజీ అలీ దర్గా మరియు మహిమ్ దర్గా ట్రస్టీ అయిన సుహైల్ ఖండ్వానీతో సంబంధం ఉన్న 29 ప్రదేశాలతో సహా ఈ ఏడాది మేలో ఎన్ఐఏ 29 ప్రదేశాలపై దాడి చేసింది. 1993 ముంబై పేలుళ్ల దోషి అయిన సమీర్ హింగోరా, ఛోటా షకీల్ యొక్క బావమరిది అయిన సలీం ఖురేషి అలియాస్ సలీం ఫ్రూట్, గుడ్డు పఠాన్, ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ బంధువు మరియు భివాండి నివాసి అయిన ఖయ్యూమ్ షేక్ తదితరులు పై దాడులు చేసిన ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఎన్ఐఏ కేసు ఆధారంగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ దర్యాప్తు ప్రారంభించింది.

పాకిస్థాన్ లో దావూద్ కు తొమ్మిది అడ్రెస్ లు.. మూడు పాస్ పోర్టులు

పాకిస్థాన్ లో దావూద్ కు తొమ్మిది అడ్రెస్ లు.. మూడు పాస్ పోర్టులు


ఇదిలా ఉంటే 2015లో భారత గూఢచార సంస్థలు తయారు చేసిన డేటా ప్రకారం, ఇబ్రహీంకు పాకిస్తాన్‌లో తొమ్మిది చిరునామాలు ఉన్నాయి. కరాచీలోని క్లిఫ్టన్‌లోని వైట్‌హౌస్‌తో సహా, మూడు పాకిస్తానీ పాస్‌పోర్ట్‌లు దావూద్ ఇబ్రహీం కు ఉన్నాయి. మొదటిది రావల్పిండిలో జారీ చేయబడింది, రెండు కరాచీలో జారీ చేయబడ్డాయి. దావూద్ ఇబ్రహీం, షేక్ దావూద్ హసన్, అబ్దుల్ హమీద్ అబ్దుల్ అజీజ్, అజీజ్ దిలీప్, దౌద్ హసన్ షేక్ ఇబ్రహీం కస్కర్, దావూద్ సబ్రీ, షేక్ ఇస్మాయిల్ అబ్దుల్ మరియు హిజ్రత్ వంటి అనేక మారుపేర్లను సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. ప్రస్తుతం దావూద్ కరాచీ కేంద్రంగా కార్యాకలాపాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం.

ముంబై కేంద్రంగా దావూద్ కోసం హవాలా వ్యాపారులు.. కేసులు నమోదు చేసిన ఎన్ఐఏ

ముంబై కేంద్రంగా దావూద్ కోసం హవాలా వ్యాపారులు.. కేసులు నమోదు చేసిన ఎన్ఐఏ


అండర్‌వరల్డ్ డాన్ యొక్క క్రిమినల్ సిండికేట్ పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాల రవాణాలో పాలుపంచుకుంటుందని గుర్తించారు. దక్షిణాసియా, మధ్యప్రాచ్యం మరియు ఆఫ్రికా నుండి దాని అక్రమ రవాణా మార్గాలను ఒసామా బిన్ లాడెన్‌తో పంచుకుందని ఎన్ఐఏ విచారణలో వెల్లడైంది . ఇక ఇటీవల దావూద్ కోసం ముంబై కేంద్రంగా హవాలా వ్యాపారులు పని చేస్తున్నట్టు గుర్తించిన ఎన్ఐఏ ఈ ఏడాది ముంబైలోని దావూద్ ఇబ్రహీం అనుచరుల ఇళ్లపై దాడులు నిర్వహించింది. ఈ దాడులలో కీలక వ్యక్తులపై, దావూద్ హవాలా ఆపరేటర్లపై కేసులు నమోదు చేసింది.

English summary
The National Investigation Agency (NIA) has announced a cash reward of Rs 25 lakh on underworld gangster Dawood Ibrahim. The NIA has announced a cash reward of Rs 20 lakh on his associates Chota Shakeel and Rs 15 lakh each on Anish, Chikna and Memon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X