వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కల్పకంలో జవాన్ల మధ్య కాల్పులు: ముగ్గురి మృతి

|
Google Oneindia TeluguNews

3 CISF personnel shot dead by colleague at Kalpakkam atomic plant in Tamil Nadu
చెన్నై: తమిళనాడులోని కల్పకం అణువిద్యుత్ కేంద్రంలో బుధవారం ఉదయం జవాన్ల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. అణువిద్యుత్ కేంద్రం ప్రాంగణంలోని సిఐఎస్ఎఫ్ కార్యాలయం వద్ద తోటి జవాన్లపై విజయ్ ప్రతాప్ సింగ్ అనే జవాను కాల్పులు జరిపాడు.

ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను అడిషనల్ సబ్ ఇన్‌స్పెక్టర్ గణేశన్(సేలం), హెడి కానిస్టేబుళ్లు సుబ్బరాజ్(చిన్నారెడ్డిపట్టి), మోహన్ సింగ్(రాజస్థాన్)లుగా గుర్తించారు.

గాయపడిన అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ పి సింగ్, హెడ్ కానిస్టేబుల్ గోవర్ధన్ సింగ్‌లను కేలంబాకమ్‌లోని ఆస్పత్రికి తరలించారు.

వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యలు తెలిపారు. కాల్పులు జరిపిన హెడికానిస్టేబుల్ విజయ్ ప్రతాప్ సింగ్‌ను కల్పకం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణకు దారి తీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ చేపట్టారు.

English summary
Three Central Industrial Security Force (CISF) personnel guarding the atomic power plant at Kalpakkam near Chennai were killed and two others were injured when one of their colleagues opened fire on them on Wednesday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X