నాగా కాల్పులు: చార్జీషీట్‌లో 30 మంది సైనికుల పేర్లు,
గతేడాది నాగాలాండ్‌లో సైన్యం చేపట్టిన అపశ్రుతి జరిగిన సంగతి తెలిసిందే. తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో భాగంగా సైన్యం కాల్పులు జరిపింది. మోన్ జిల్లా ఓటింగ్ గ్రామంలో స్థానికులపై సైన్యం ఫైర్ చేసింది. కాల్పుల్లో 14 మంది జనాలు ప్రాణాలు కోల్పోయారు. గ్రామస్థులను గుర్తించడంలో పొరపాటు వల్లే ఇలా జరిగిందని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఘటనపై నాగాలాండ్ ప్రభుత్వం విచారణ చేపట్టింది. జవాన్లపై దర్యాప్తు అధికారులు చార్జీషీట్ దాఖలు చేశారు. అందులో 30 మంది సైనికుల పేర్లను చేర్చింది.

కేసుకు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లేదంటే సిట్ కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేస్తోందని తెలిపింది. చార్జీషీట్‌లో ఒకరు ఆర్మీ ఆఫీసర్ ఉండగా.. 29 మంది జవాన్లు ఉన్నారు. కాల్పులు జరిపే సమయంలో సైనికులు రూల్స్ పాటించలేదని సిట్ ఆరోపించింది. అయితే నిఘా వర్గాల పక్కా సమాచారంతో భద్రతా బలగాలు తిరు-ఓటింగ్ రహదారిపై ఆకస్మిక దాడికి వ్యూహరచన చేశాయి. పొరపాటున గ్రామస్థులను తిరుగుబాటుదారులుగా భావించి కాల్పులు జరిపారు.
సైన్యం జరిపిన కాల్పుల్లో గ్రామస్థులు చనిపోవడంతో స్థానికులు కోపోద్రిక్తులయ్యారు. వారిలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుని భద్రతా బలగాలను చుట్టుముట్టారు.
సైనికుల వాహనాలకు నిప్పటించి సైన్యం పైకి దూసుకొచ్చారు. ఈ సమయంలో వారి నుంచి తమను తాము కాపాడుకోడానికి సైన్యం ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపడంతో పలువురు గాయపడ్డారు. సైన్యం కాల్పుల్లో 14 మందికిపైగా మృతిచెందినట్టు తెలుస్తోంది. ఈ కేసులో 30 మంది సైనికుల చేర్లను ఛార్జీషీట్‌లో చేర్చారు.












Click it and Unblock the Notifications