Sunstroke: యూపీలో దారణం.. వడదెబ్బతో 34 మంది మృతి
దేశంలోకి నైరుతి రుతుపవనాలు వచ్చినా.. ఎండల తీవ్రత తగ్గడం లేదు. గుజరాత్, రాజస్థాన్ లో వర్షాలు పడుతుంటే.. ఉత్తర్ ప్రదేశ్, బీహార్ లో ఎండలు మండిపోతున్నాయి. యూపీలోని బల్లియాలోని జిల్లా ఆసుపత్రిలో జూన్ 15 నుంచి 16 వరకు 44 మంది వడదెబ్బుతో చేరారు. ఆస్పత్రిలో చేరిన వారిలో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
వడదెబ్బకు ఆస్పత్రిలో చేరి గడిచి24 గంటల్లో 34 మంది మృతిచెందినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఎక్కువ మంది60 ఏండ్లకు పైబరిన వారేనని చెప్పారు. "ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరణాలపై విచారణ ప్రారంభించింది. లక్నో నుంచి ఇద్దరు డైరెక్టర్ స్థాయి అధికారులను జిల్లాకు పంపారు" అని అధికారి తెలిపారు.

బల్లియా జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ దివాకర్ సింగ్‌ను బదిలీ చేసినట్లు అధికారి తెలిపారు. శనివారం నాడు సింగ్ మాట్లాడుతూ జిల్లా ఎండ వేడిమితో అల్లాడిపోతోందని అన్నారు. "పెరిగిన వేడి అందరికీ సమస్యగా ఉంటుంది. కానీ అలాంటి వాతావరణ పరిస్థితుల్లో, రక్తపోటు, బ్రోన్చియల్ ఆస్తమా వంటి వ్యాధులతో బాధపడేవారికి ఈ సమస్యలు మరింత తీవ్రమవుతాయి" అని చెప్పారు
జూన్ 15న 23 మంది చనిపోగా, జూన్ 16 మధ్యాహ్నం వరకు 11 మంది మరణించినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అయితే, శుక్రవారం మరో 10 మంది మరణించారని ఆసుపత్రి సీనియర్ అధికారి తెలిపారు. "గత 50 గంటల్లో, 44 మరణాలు నమోదయ్యాయి" అని అధికారి తెలిపారు. శనివారం బల్లీయా జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ నమోదు అయింది.
ఇది సాధారణం కంటే ఐదు డిగ్రీలు ఎక్కువని అధికారులు చెప్పారు. భారత వాతావరణ శాఖ ప్రకారం, జూన్ 16న బల్లియాలో గరిష్ట ఉష్ణోగ్రత 42.2 డిగ్రీల సెల్సియస్ (సాధారణం కంటే ఐదు డిగ్రీలు ఎక్కువ), జూన్ 15న 42 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం,జిల్లాలో అత్యధికంగా 43 నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు యూపీలో విద్యుత్ కోతలతో, మంచినీరు , ఫ్యాన్లు, ఎయిర్ కండీషన్లు లేక జనాలు లేక జనాలు నానా అవస్థులు పడుతున్నారు. విద్యుత్ కోతలతో కొన్ని చోట్లు నిరసనలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications