ఏడంతస్థుల భవనంలో మంటలు, నలుగురు మృతి

సిద్ధార్థనగర్ ప్రాంతంలోని భవనంలో సోమవారం ఉదయం మంటలు లేచాయని ఫైర్ బ్రిగేడ్ వర్గాలు పిటిఐ వార్తా సంస్థతో చెప్పాయి. అగ్ని ప్రమాదానికి గురైంది నివాస భవనం. మంటలు అంటుకున్న సమయంలో భవనంలోని చాలా మంది నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
సోమవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో మంటలు లేచినట్లు తెలుస్తోంది. గౌతం 955), అతని భార్య పూర్ణిమ (50), కుమారుడు విశాల్ (32), మనువడు (10) మంటల్లో కాలిపోయారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. అయితే, అసలు కారణమేమిటనే తెలియడం లేదు.












Click it and Unblock the Notifications