కబళించిన కరోనా: రక్కసితో పోరాడి ఓడిన 4 నెలల పసిపాప, పేరంట్స్‌కు పరీక్షలు..
కరోనా వైరస్ రక్కసి మరో చిన్నారిని బలితీసుకుంది. నాలుగునెలల పసిపాపను కరోనా కబళించింది. చిన్నారి చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలివేసలా రోదిస్తున్నారు. పేరంట్స్‌కు వైరస్ సోకిందెమోనని వైద్యులు పరీక్షిస్తున్నారు.
కేరళలోని మలప్పురం జిల్లా మంజేరిలోని పయ్యనాడుకు చెందిన దంపతులకు నాలుగునెలల క్రితం పాప జన్మించింది. అయితే అప్పడే కరోనా వైరస్ బయటపడగా.. పాపకు పుట్టినప్పటి నుంచి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. దీంతో తల్లిదండ్రులు నాలుగు నెలల నుంచి తిరగని ఆస్పత్రి లేదు.

చిన్నారిని ఈ నెల 21వ తేదీన కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆమెకు న్యూమోనియా వచ్చింది. దాంతో కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. వైరస్‌తో పోరాడిన చిన్నారి శుక్రవారం ఓడిపోయింది. ఉదయం 6 గంటలకు గుండెపోటు రావడంతో తల్లిదండ్రులకు కడుపునిండ దు:ఖాన్ని మిగిల్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.
జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటంతో ఆస్పత్రికి తీసుకొచ్చామని పేరంట్స్ చెబుతున్నారు. వారికి ఏమైనా వైరస్ సోకిందెమోనని పరీక్షలు చేస్తున్నారు. వారు విదేశీ ప్రయాణం చేయలేదు కానీ.. పాప పుట్టినప్పటి నుంచి చికిత్స కోసం వివిధ ఆస్పత్రులు తిరుగుతూనే ఉన్నారు. చివరికి వారిని వదిలేసి చిన్నారి వెళ్లిపోయింది.












Click it and Unblock the Notifications