మరోసారి కరోనా విజృంభణ - కేంద్రం అప్రమత్తం..!!

దేశ వ్యాప్తంగాకరోనా మరోసారి వేగంగా వ్యాపిస్తోంది. గడచిన 24 గంటల్లో 4,435 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య ప్రకటించింది. 15 మంది మరణించారు. దాదాపు 163 రోజుల తరువాత ఈ స్థాయిలో కేసుల సంఖ్య నమోదైంది. గత ఏడాది సెప్టెంబర్ తరువాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావటంతో ఇదే ప్రధమం.

ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 23,091గా ఉన్నాయి. ఈ సంఖ్య భారీగా పెరగటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో కేంద్రం అలర్ట్ అయింది. కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.

కరోనా ఇన్ఫెక్షన్ల కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. తాజాగా నమోదైన కరోనా కేసులతో కలిపి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,47,33,719 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక మంగళవానం ఒక్కరోజే కరోనాకు 15 మంది మృతి చెందారు. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో నలుగురు కరోనాతో మృతి చెందారు.

Coronavirus Cases Increase

ఛత్తీస్‌గఢ్‌, ఢిల్లీ, గుజరాత్‌, హర్యానా, కర్ణాటక, పుదుచ్చేరి, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. కోవిడ్‌ రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 3.38 శాతంగా ఉంది. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా.. ఇప్పటివరకు కేంద్రం 220.66 కోట్ల డోసుల వ్యాక్సిన్లను పంపిణీ చేసింది.

వైరస్‌ వ్యాప్తికి ప్రస్తుత వాతావరణం అనుకూలంగా ఉందని ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా ప్రతిరోజూ మూడువేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒక్క దేశరాజధాని ఢిల్లీలోనే ప్రతిరోజూ 400 పైగా వైరస్‌ ఇన్ఫెక్షన్‌ కేసులు నమోదవుతున్నాయి.

దీంతో ఆసుపత్రుల్లో చేరికలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఆరు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరగటం పైన కేంద్రం పత్యేకంగా ఫోకస్ చేసింది. వెంటనే పరీక్షలను పెంచటంతో పాటుగా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తమిళనాడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాస్క్ వినియోగం తప్పని సరి చేసారు. ఇప్పుడు కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లోనూ మాస్క్ వినయోగం తప్పని సరి చేసే అవకాశం కనిపిస్తోంది. కేసులు పెరుగుతున్న వేళ రెండు తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+