ఘోర ప్రమాదం: బస్సును ఢీకొన్న రైలు, 6గురు చిన్నారుల మృతి

5 children killed as school bus collides with train in UP
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మావ్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. రైల్వే క్రాసింగ్ వద్ద ఓ పాఠశాల బస్సును ప్యాసింజర్ రైలు ఢీకొంది. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మందికి పైగా చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అజంఘర్ - వారణాసి పాసింజర్ రైలు వారణాసి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పాసింజర్ రైలు వెళ్లే సమయంలో బస్సు క్రాసింగ్ దాటుతుండగా ఇది జరిగింది. మావ్ - కురాహట్ మధ్యన ఈ క్రాసింగ్ ఉంది.

నార్త్ ఈస్టర్న్ రైల్వే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ఆరుగురు చిన్నారులు మృతి చెందారని, 16 మంది చిన్నారులు గాయపడ్డారని చెప్పారు. మావ్ రైల్వే పోలీసులు, అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+