విషాదం.. సుశాంత్ రాజ్‌పుట్ ఫ్యామిలీలో ఐదుగురు దుర్మరణం.. ఎలా అంటే..

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబ సభ్యులు మృత్యువాత పడ్డారు. సుశాంత్ బంధువు ఓం ప్రకాష్ సోదరి అంత్యక్రియలకు బంధువులందరు హాజరయ్యారు. అనంతరం మంగళవారం ఉదయం కారులో 10 మంది తిరిగి పాట్నాకు బయల్దేరారు.

 5 members of Sushant Singh Rajput’s family killed in road accident

లఖిసరాయ్‌ జిల్లా వద్దకు వచ్చేసరికి కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మరణించిన వారిలో సుశాంత్‌ మేనల్లుడు సహా బావ, హర్యానా కేడర్‌ ఐపీఎస్‌ ఓం ప్రకాశ్‌ సింగ్‌ సమీప బంధువులు ఉన్నారు. దీంతో మరోసారి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

ఇటు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకుని ఏడాది అవుతోంది. నాటకీయ పరిణామాలతో అనేక మలుపులు తీసుకున్న సుశాంత్ కేసును చివరకు ఆత్మహత్యగా తేల్చారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడగానికి గల కారణం ఏంటో మాత్రం ఇప్పటివరకూ కనిపెట్టలేకపోయారు. ఎయిమ్స్ సిబిఐకి సమర్పించిన ఫోరెన్సిక్ నివేదికలో సుశాంత్ అస్ఫిక్సియా కారణంగా మరణించాడని తెలిసింది. సుశాంత్ మృతి సెగ బాలీవుడ్ కు గట్టిగానే తగిలిందని చెప్పాలి.

ఆయన ఆత్మహత్యతో బాలీవుడ్ లో నెపోటిజంపై అంతకుముందెన్నడూ ఎరుగని రేంజ్ ఫైర్ అయ్యారు. సుశాంత్ ఆత్మహత్య కేసులో వెలుగు చూసిన డ్రగ్ కోణం మరో సంచలనానికి తెరతీసింది. అందులో స్టార్స్ పేర్లు బయటకు రావడం బాలీవుడ్ కు గట్టి దెబ్బ. బాలీవుడ్ ధగధగలు వెనుక దాగున్న చీకటి కోణాలను వెలుగులోకి తెచ్చింది సుశాంత్ మరణం. అప్పటికే సుశాంత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ప్రేయసి రియా చక్రవర్తి ఈ డ్రగ్స్ కేసులోనే జైలుకు వెళ్ళింది. ఆ తరువాత బెయిల్ పై బయటకు వచ్చినప్పటికీ సుశాంత్ అభిమానుల ట్రోలింగ్ కు బలైంది.

ఇక ఇటీవలే సుశాంత్ ఫ్రెండ్ సిద్ధార్థ్ పితానిని డ్రగ్స్ కేసులో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మొత్తానికి సుశాంత్ ఆత్మహత్య చేసుకుని ఏడాది గడుస్తున్నా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడం ఆయన అభిమానులను బాధ పెడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+