కట్నమంటే పెళ్లే వద్దు, బజారుకీడుస్తాం! సర్వేలో యువతులు, అబ్బాయిలు కూడా
కోల్‌కతా: కాబోయే తన అత్తంటి వారు కట్నం అడిగితే ఏకంగా పెళ్లికే ససేమీరా అనేందుకు సిద్ధంగా ఉన్నారట చాలామంది యువతులు. కట్నం అడిగితే పెళ్లి వద్దని నిర్మోహమాటంగా చెబుతామని దాదాపు సగానికి పైగా అమ్మాయిలు చెప్పారు. ఇది తాజాగా వెల్లడైన ఓ సర్వేలో తెలిసింది.
దేశవ్యాప్తంగా షాదీ.కామ్ 24-35 ఏళ్ల మధ్య ఉన్న యువతులను పెళ్లి, కట్నం తదితర అంశాల పైన ప్రశ్నించింది. ఇందులో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. కాబోటే అత్తింటి వారు కట్నం అడిగితే పెళ్లి ఓప్పుకోమని 51.4 శాతం మంది యువతులు చెప్పారు.

ఒకవేళ కట్నం అడిగితే ఆ కుటుంబం గురించి నలుగురికి చెప్పి అవమానించాలని ఉందని 48.6 శాతం మంది యువతులు చెప్పారు. వారి కుటుంబం బజారులో అవమానపర్చాలని భావిస్తున్నామని తెలిపారు. ఈ సర్వే ఆన్ లైన్ ద్వారా చేశారు. 5,680 మంది దీనిపై స్పందించారు.
కట్నం అడిగితే జైలుకు పంపించాలని 59.8 శాతం మంది అబ్బాయిలు కూడా చెప్పారు. అలాంటివారిని బహిరంగంగా అవమానించాలని 4.2 శాతం మంది అబ్బాయిలు చెప్పారు. ఇలాంటి చెడు ఆచారాన్ని రూపుమాపాలని 75 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ వెబ్ సైడ్ డౌరీ ఫ్రీ సొసైటీగా చేయాలని కృతనిశ్చయంతో పని చేస్తోందని షాదీ.కామ్ సీఓఓ గౌరవ్ రక్షిత్ చెప్పారు.












Click it and Unblock the Notifications