కూతురుపై అత్యాచారయత్నం: భార్య ఫిర్యాదు, అరెస్ట్

భోపాల్: ఓ యాభై ఏళ్ల వ్యక్తి తన కన్న కూతురు(16)పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతన్ని ప్రతిఘటించిన భార్య, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు, గురువారం అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ జిల్లాలోని సింధియానగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు కున్వర్ పాల్ జాతవ్ తరచూ మద్యం తాగి వచ్చి తన కూతురును చితకబాదుతున్నాడని అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూన్ 17న కూడా మద్యం సేవించి వచ్చిన తన భర్త.. కూతురును కర్రతో చితకబాదాడని తెలిపింది.

50-year-old held for rape bid on daughter

అంతేగాక ఆమెపై తను ఇంట్లో లేని సమయంలో అత్యాచారానికి యత్నించేవాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. చిన్న చిన్న కారణాలతో తన కూతురును చితకబాదేవాడని తెలిపింది.

నిందితుడు కున్వర్ పాల్ జాతవ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, అతనిపై సెక్షన్ 354 (లైంగిక వేధింపులు) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+