విరిగిపడిన మంచు చరియలు.. చిక్కుకుపోయిన 57 మంది కార్మికులు
త్తరాఖండ్ లోని బద్రీనాథ్ లో జాతీయ రహదారిపై భారీ హిమపాతం సంభవించింది. హిమపాతం ధాటికి మంచు చరియలు విరిగి పడ్డాయి. దీంతో అక్కడే పనిచేస్తున్న బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్(BRO)కు చెందిన 57 మంది కార్మికులు మంచులో చిక్కుకుపోయారు. కార్మికులు రోడ్డు పక్కన పనిచేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీస్ ఉత్తరాఖండ్ ఐజీ స్పందించారు.
After many years, we are witnessing such snowfall. pic.twitter.com/ji7wcBL318
— Go Himachal (@GoHimachal_) February 28, 2025
"బద్రీనాథ్ లోని బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్(BRO)కు చెందిన క్యాంప్ వద్ద భారీ హిమపాతం సంభవించి మంచు చరియలు విరిగి పడ్డాయి. దీంతో అక్కడే పనిచేస్తున్న 57 మంది కార్మికులు మంచులో చిక్కుకుపోయారు. 10 మందిని రక్షించాం. మనాలోని ఆర్మీ క్యాంప్ నకు తరలించాం. మిగతా వారిని బయటకు తీసుకొచ్చే పనిలో ఉన్నాం. మంచు భారీగా కురుస్తున్న క్రమంలో కార్మికుల దగ్గరికి వెళ్లలేకపోతున్నాం" అని ఐజీ నీలేశ్ ఆనంద్ భార్నె తెలిపారు.

ఘటనా స్థలిలో మూడు అంబెలెన్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మంచు కూరుకుపోవడం వల్ల లోపలికి వెళ్లలేకపోతున్నామని.. మంచులో చిక్కుకున్న కార్మికులను ఎలాగైనా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అయితే గత రెండు రోజులుగా ఉత్తరాఖండ్ లో భారీగా మంచు కురుస్తోంది.












Click it and Unblock the Notifications